సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::ఘంటసాల,మాధవపెద్ది సత్యం
తారాగణం::N.T. రామారావు, జమున, S.V. రంగారావు,రాజనాల, L. విజయలక్ష్మి,శాంతకుమారి .
::::::::
అల్లుడు::తగునా ఇది మామ
తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా
నిగమ మార్గములు తెలిసిన నీవే
ఇటులనదగునా..తగునా ఇది మామా
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ
అల్లుడనగనెవడు మీ అమ్మాయికి మగడూ
నీవు కాళు కడిగి కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుడు మీద అలుకబూన ఏటికి చీటికి మాటికి
తగునా ఇది మామా..తమరే ఇటు బల్క నగున తగునా ఇది మామా
మామ::ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమునకు భోజనమ్మునకు
ఇక రావలదు రా తగదు ఛీ పోఫోఫోర పొమ్మికన్
అరెరే ఎంతటి మోసగాడవుర..నాకే టోపీ వేసిన్ ఆవుర
అరెరే ఎంతటి మోసగాడవుర..నాకే టోపీ వేసిన్ ఆవుర
నీ సాహసము పరీహాసము..నీ సాహసము పరీహాసము
నిర్భాగ్యుల తోటి సహవాసము..సహించను క్షమించను
యోచించను నీ మాటన్..వచ్చిన బాటన్ పట్టుము వేగన్
ఫోఫోర ఫొమ్మికన్ నా గృహమునకు భోజనమ్మునకు
ఇక రావలదు రా తగదు ఛీ పోఫో
అల్లుడు::కొడుకులు లేనందుకు..తల కొరివి బెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనే..డైరెక్టుగ స్వర్గానికి చీటి నిచ్చువాడనే
తల్లి లేని పిల్ల ఉసురు తగలదె..ఒంటిగ ఉంచగ తగునా ఇది మామా
మామ::అరె ఊరికెల్ల మొనగాడినే..ఏ..అరె ఊరికెల్ల మొనగాడినే
పెద్ద మిల్లుకెల్ల యజమానినే..నీ డాబూసరి భలే బిత్తరి
నీ డాబూసరి భలే బిత్తరి..నిజమే నని నమ్మితి పోకిరి
దురాత్ముడ దుష్టాత్ముడ గర్వాత్ముడ ..నీచుడా ఇపుడే తెలిసెన్
నీ కథ ఎల్లన్ ఫోఫోర ఫొమ్మికన్..ఫోఫోర పొమ్మికన్
నా గృహమునకు భోజనమ్మునకు..ఇక రావలదు రా తగదు ఛీ ఫోఫో
Raamudu Bheemudu-1964
Music::PendyalaNaageswaraRaavu
Lyrics::Kosaraaju Raaghavayya
Singer::Ghantasala,Maadhavapeddi Satyam
Cast::N.T.Ramaravu,Jamuna,L.vijayalakshmii,S.V.Rangaravu,Rajanaala,Santakumari.
::::::
alluDu::tagunaa idi maama
tamarE iTu balka naguna
tagunaa idi maamaa
nigama maargamulu telisina neevE
iTulanadagunaa..tagunaa idi maamaa
alluDanaganevaDu mee ammaayiki magaDuu
alluDanaganevaDu mee ammaayiki magaDuu
neevu kaaLu kaDigi kanyaadaanamu chEsina ghanuDu
A ghanuDu meeda alukaboona ETiki chiiTiki maaTiki
tagunaa idi maamaa..tamarE iTu balka naguna tagunaa idi maamaa
maama::phOphOra phommikan naa gRhamunaku bhOjanammunaku
ika raavaladu raa tagadu Chii pOphOphOra pommikan
arerE entaTi mOsagaaDavura..naakE TOpii vEsin aavura
arerE entaTi mOsagaaDavura..naakE TOpii vEsin aavura
nee saahasamu pariihaasamu..nee saahasamu pariihaasamu
nirbhaagyula tOTi sahavaasamu..sahinchanu kshaminchanu
yOchinchanu nee maaTan..vachchina baaTan paTTumu vEgan
phOphOra phommikan naa gRhamunaku bhOjanammunaku
ika raavaladu raa tagadu Chii pOphO
alluDu::koDukulu lEnanduku..tala korivi beTTuvaaDanE
neeku korivi beTTuvaaDanE..DairekTuga swargaaniki chiiTi nichchuvaaDanE
talli lEni pilla usuru tagalade..onTiga unchaga tagunaa idi maamaa
maama::are Urikella monagaaDinE..E..are Urikella monagaaDinE
pedda millukella yajamaaninE..nee Daabuusari bhalE bittari
nee Daabuusari bhalE bittari..nijamE nani nammiti pOkiri
duraatmuDa dushTaatmuDa garvaatmuDa ..neechuDaa ipuDE telisen
nee katha ellan phOphOra pHommikan..phOphOra pommikan
naa gRhamunaku bhOjanammunaku..ika raavaladu raa tagadu Chii phOphO
No comments:
Post a Comment