Friday, June 14, 2013

నిప్పులాంటి మనిషి--1974



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత,దేవిక,విజయభాను 

పల్లవి::

ఏదో అనుకున్నాను..ఏమేమొ కలగన్నాను 
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా
ఏదో అనుకున్నాను.. ఏమేమొ కలగన్నాను 
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా  
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ


చరణం::1

ఏ నీడ లేని దానా..ఎందుకో నా పైనా 
చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ  

ఏ నీడ లేని దానా..ఎందుకో నా పైనా 
చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ 
మరునిమిషం ఆ హృదయం తెరపాలైపోయెనా

ఏదో అనుకున్నాను..ఏమేమొ కలగన్నాను
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా 

చరణం::2

పూలెన్నో తెచ్చానూ..మాలలెన్నో అల్లానూ
మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను
పూలెన్నో తెచ్చానూ..మాలలెన్నో అల్లానూ
మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను
మరునిమిషం ఆ దైవం కనుమరుగైపొయెనా

ఏదో అనుకున్నాను..ఏమేమొ కలగన్నాను 
అంతలో కల కరిగెనా..ఆ దైవమే పగబూనెనా

No comments: