సంగీతం::T.V. రాజు
రచన::సముద్రాల రామానుజాచార్య(జునియర్)
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,B.సరోజాదేవి (తెలుగు చిత్రసీమకి తొలి పరిచయము),అంజలీదేవి, నాగయ్య,పద్మనాభం,K.శివరావు,ఛాయాదేవి,పేకేటి శివరాం
పల్లవి::
అహాహాహాహా..అహాహాహాహా
ఓహోహోహోహో..ఓ ఓ ఓహోహో
తరం తరం నిరంతరం ఈ అందం
ఓహో..ఆనందం అందం ఆనందం
తరం తరం నిరంతరం ఈ అందం
ఓహో..ఆనందం అందం ఆనందం
ఆనంద లీలే గోవింద రూపం
ఈ మాట అంటే పెద్దలకు కోపం
చరణం::1
మోజులే రేపు చిరునవ్వు చిందులు
జాజి చెక్కిళ్ల సోయగాల విందులు
మోజులే రేపు చిరునవ్వు చిందులు
జాజి చెక్కిళ్ల సోయగాల విందులు
వరద పొంగేనులే వయసు సింగారము
అనుభవించీ సుఖించీ తరించరా..హోయ్
చరణం::2
మోహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటులేలనే
మోహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటులేలనే
నేడు వెనకాడినా రేపు ఒనగూడునా
అనుభవించీ సుఖించీ తరించరా..హోయ్
No comments:
Post a Comment