Thursday, June 26, 2014

వియ్యాలవారి కయ్యాలు--1979



సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::P.సుశీల,S.P.బాలు  
తారాగణం::కృష్ణ,జయప్రద,నాగభూషణం,రావు గోపాలరావు,సూర్యకాంతం,S.వరలక్ష్మి,జయమాలిని

పల్లవి::

పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ..ఆ
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ..ఆ

చరణం::1

దేవుడి మాట..కోవెల గంట
దీవెనగా..పలికింది
పండగ పూట..పడుచుల పాట 
పల్లె పదంగా..మిగిలింది

అనురాగాలే విను..రాగాలై
మమతల వేణువు..పిలిచింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ..ఆ

చరణం::2

రెప రెపలాడే రెప్పలలోనే 
రేపటి పొద్దులు మెరవాలి
నవనవలాడే నవ్వులలోనే 
వయసు వసంతలాడే
కన్నెతనంలో వెన్నెల 
కెరటం నేడే ఈడై ఎగసింది

పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ..ఆ
ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది
గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది
పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ..ఆ

No comments: