సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::చలం, శారద,పద్మనాభం,కాంతారావు,రమణారెడ్డి,నిర్మల,రమాప్రభ,శాంతకుమారి
పల్లవి::
చేరువలోనే దూరములేలా
రాధమ్మా..నా చెంత రావేలనే
రాధమ్మా..ఈ చింత నీ కోసమే
దూరములోనే చేరువ వుంది
ఓ రాజా..ఉన్నాను నీ నీడగా
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా
చరణం::1
విరహాలు నన్ను..దహియించు వేళ
కురిపించవేల..అనురాగ ధార
విరహాలు నన్ను..దహియించు వేళ
కురిపించవేల..అనురాగ ధార
కులుకుల చినుకులె..పన్నీటి జల్లు
రాధమ్మా..నా చెంత రావేలనే
రాధమ్మా..ఈ చింత నీ కోసమే
దూరములోనే చేరువ వుంది
ఓ రాజా..ఉన్నాను నీ నీడగా
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా
చరణం::2
ఆనాటి నుంచీ..నీ దాననేగా
ఈనాడు నీలో..ఈ తొందరేలా
ఆనాటి నుంచీ..నీ దాననేగా
ఈనాడు నీలో..ఈ తొందరేలా
మనసున మమతలు..నీ పూజకేలే
ఓ రాజా..ఉన్నాను నీ నీడగా
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా
చేరువలోనే దూరములేలా
రాధమ్మా..నా చెంత రావేలనే
రాధమ్మా..ఈ చింత నీ కోసమే
ఓ రాజా..ఉంటాను నీ తోడుగా
No comments:
Post a Comment