సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,L.R.ఈశేరీ
తారాగణం::N.T.రామారావు, మంజుల,S.V. రంగారావు,విజయలలిత
పల్లవి::
నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా
చన్నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా
నీళ్ళేకదా అని నేనీదబోతే
నిప్పులుగా మారే మరదలా
నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా
చరణం::1
నీటిలోనా నిప్పు అంటే నేనూ నమ్మలేనమ్మోయ్
అదే అదే నీ వయసులోనీ ఆవిరే అవునేమో
ఉన్నమాట అన్నావు ఈ వేళా..ఆహా
ఆ వన్నెగాడు వేసాడు ఈ జ్వాలా
ఒహో..హు హు..హ హా
నీళ్ళేమంటున్నాయీ ఓ వదినా
చరణం::2
చిలిపిగ విసిరే చలిగాలీ నీ చెవిలో
నీ చెవిలో ఏమని చెబుతున్నదీ
ఏమని ఏమని చెబుతున్నదీ
నీవున్నచోటే మీ అన్న ఉంటే
నీవున్నచోటే మీ అన్న ఉంటే
ఆ వరసే వేరని అంటున్నదీ
ఆ వరసే వేరని అంటున్నదీ
నీళ్ళేమంటున్నాయీ మరదలా
చన్నీళ్ళేమంటున్నాయీ మరదలా
నీళ్ళో నిప్పులో తెలియదు గానీ
నా ఒళ్ళంతా ఉడుకెత్తే ఎదోలా
ఎప్పుడూ జరగలే..ఇల ఇల ఇల ఇలా
చరణం::3
ఇందాకలేనీ ఈ వింత వేడీ
ఈ క్షనమే ఏల కలిగిందమ్మో
నీ ఒంటిలోనా నిలువని ఆ వేడి
నిరుపై నాలో ఉరికిందమ్మో
రేపో మాపో వస్తాడు తగినోడూ
ఈ తాపమంతా తగ్గించి పోతాడూ
రేపో మాపో వస్తాడు తగినోడూ
ఈ తాపమంతా తగ్గించి పోతాడూ
హుహు హుహు హుహుహు హుహుహు
హుహు హుహు హుహుహు హుహుహు
No comments:
Post a Comment