Sunday, June 02, 2013

అమ్మ మనసు--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు  
తారాగణం::చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు 

పల్లవి::

ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు 
ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు 
అందరం నేల తల్లి పాపలం మనమందరం 
ఆ తల్లి చూపులం, చల్లని చూపులం 
ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు 
ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు 
అందరం నేల తల్లి పాపలం మనమందరం 
ఆ తల్లి చూపులం చల్లని చూపులం 

చరణం::1

మఱిచెట్టు ఎంత ఎత్తు పెరిగినా 
తాను పుట్టిన మట్టిని అది మరిచెనా
మఱిచెట్టు ఎంత ఎత్తు పెరిగినా 
తాను పుట్టిన మట్టిని అది మరిచెనా
ఊడలనే చేతులతో మొక్కుతుంది 
తన కన్నతల్లి ఋణం కాస్త తీర్చుకుంటుంది
ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు 
ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు 

చరణం::2

నడుమ వచ్చిన సంపదలు ఎన్నాళ్ళు 
నిలిచేను ఏటిలోని నురగలు మరునాటికేమవును
నడుమ వచ్చిన సంపదలు ఎన్నాళ్ళు 
నిలిచేను ఏటిలోని నురగలు మరునాటికేమవును
కలిమిలేములు జీవితానికి రెండు పక్కలురా 
కలిమిలేములు జీవితానికి రెండు పక్కలురా
వెలుగు నీడలు కాలానికి రెండురెక్కలురా ఒరేయ్  
ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు 
ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు 

చరణం::3

పుట్టినపుడు నేనోబైరాగిని కానీ పెట్టిన పేరేమో రాజనీ 
పుట్టినపుడు నేనోబైరాగిని కానీ పెట్టిన పేరేమో రాజనీ
లక్షలున్నా కోట్లున్నా లక్షలున్నా కోట్లున్నా ఎప్పటికి రాజన్ననే
మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే మీ అన్ననే ఆ పిచ్చన్ననే 
ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాళ్ళు 
ఎవరు ఎవరు ఎవరురా చిన్నవాళ్ళు 
అందరం నేల తల్లి పాపలం మనమందరం 
ఆ తల్లి చూపులం చల్లని చూపులం చల్లని చూపులం

No comments: