Wednesday, May 14, 2014

నీరాజనం--198



సంగీతం::O.P. నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::S.జానకి
తారాగణం::శరణ్య,విశ్వాస్.

పల్లవి::

ఓహోహో..ఆహాహా
ఓహోహో..ఆహా ఆహా ఆహా

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

చరణం::1

ఆహాహహా ఆహహా ఆహహా
హద్దులో అదుపులో ఆగనీ గంగలా
నీటిలో నిప్పులో నిలువనీ గాలిలా
విశ్వమంత నిండియున్న ప్రేమకూ
ప్రెమలోన బ్రతుకుతున్న ఆత్మకూ
విశ్వమంత నిండియున్న ప్రేమకూ
ప్రెమలోన బ్రతుకుతున్న ఆత్మకూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

చరణం::2

ఆహాహహా ఆహహా ఆహహా
వెలగనీ దివ్వెనై పలకనీ మువ్వనై
తియ్యనీ మమతకై తీరనీ కోరికై
వేచి వేచి పాడుతున్న పాటకూ
పాటలోన కరుగుతున్న జన్మకూ
వేచి వేచి పాడుతున్న పాటకూ
పాటలోన కరుగుతున్న జన్మకూ

నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ
ఈ ప్రేమయాత్రకేది అంతమూ

No comments: