Wednesday, May 14, 2014

జడగంటలు--1984


సంగీతం::పుహళేంది
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల

పల్లవి::

ఆ..ఆ..ఆ
లలలలలలలల..లాలాలా..లాలాలా
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా..పువ్వు పూయాలా..రావేలా..ఆ
జడ గంటమ్మా..రతనాలమ్మా..జానకమ్మా
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

చరణం::1

లలల..ఆ
లలలలల..లాలలలా
పాపికొండలా..పండువెన్నెలా..పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా..ఆఆఆ
పాపికొండలా..పండువెన్నెలా..పకపక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే..ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే..ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా..గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా
నే కుంగిపోవాలా
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది..ఈ
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

చరణం::2

లలలల లాలాలా..లలలల లాలాలా
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా..మ్మ్ మ్మ్ మ్మ్
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే..గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే..గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండు ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి కుంగిపోవాలా..ఆ
నే కుంగిపోవాలా
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా..పువ్వు పూయాలా..రావేలా
జడ గంటమ్మా..రతనాలమ్మా..జానకమ్మా
ఆ..ఆ..ఆ..
పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చిపొమ్మని గోదారడిగింది

No comments: