Thursday, May 21, 2015

శంకరాభరణం--1980



సంగీతం::K.V.మహాదేవన్
రచన::వేటూరి..త్యాగయ్య కృతి 
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::J.V.సోమయాజులు,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య,మంజు భార్గవి,రాజ్యలక్ష్మి

పల్లవి::

సామజవరగమనా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత 
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత..సామజవరగమన

సామనిగమజ సుధా
సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ

సామజవరగమనా

చరణం::1

ఆమని కోయిలా..ఇలా నా జీవనవేణువులూదగా
ఆమని కోయిలా..ఇలా నా జీవనవేణువులూదగా
మధురలాలసల మధుప లాలనల
మధుర లాలసల మధుప లాలనల 
పెదవిలోని మధువులాను
వ్రతము పూని జతకు చేరగా

నిసా దనీ మదా గమా
సమమగ గదదమ మనినిద సనిదమ దనిసా దనిసా
గదదమ మనినిద దససని గపనిద నిసగ నిసగ
సమగమ గససని నిగసగ సనినిద దనినిద 
మదదని గమదని సనిదమగస

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత..సామజవరగమన

చరణం::2

వేసవి రేయిలా..ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా..ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరుల పాన్పు పరచి నిన్ను
పలుకరించగా

ఊ..ఆ..గమా గమదమ గమా
గమనిద మదా మదనిస దనినినిని
మద నినినిని
గమదదదద మదనినిని
గమద సాసా సానీ సాగా
సగమగ గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా..ఆ..ఆ

No comments: