Tuesday, May 11, 2010

మా దైవం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::రాజశ్రీ 
గానం::S.P.బాలు.P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,జయచిత్ర,నాగభూషణం,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,పండరీబాయి

పల్లవి::

ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
అది ఎప్పటికైన..చెప్పక తప్పదు 
నా మనసుతో..నా మనసుతో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
నువ్వు చెప్పకనే..అది తెలుస్తుంది 
నీ కళ్ళలో..నీ కళ్ళలో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో 

చరణం::1

ఓరచూపులో..కొంటె వూహలు 
ఉరికి ఉరికి..పడుతున్నాయి
దోరవయసులో..కొత్త సొగసులూ 
తోడు..కోరుకుంటున్నాయి
ఓరచూపులో..కొంటె వూహలు 
ఉరికి ఉరికి..పడుతున్నాయి
దోరవయసులో..కొత్త సొగసులూ 
తోడు..కోరుకుంటున్నాయి
వద్దు వద్దంటున్నా..కలలోకి వస్తావు
సద్దు మణిగిందంటే..పొద్దు పోదంటావు
వద్దు వద్దంటున్నా..కలలోకి వస్తావు
సద్దు మణిగిందంటే..పొద్దు పోదంటావు
నిద్దరే పోకుండా..నన్ను వూరిస్తావు 
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
నువ్వు చెప్పకనే..అది తెలుస్తుంది 
నీ కళ్ళలో..నీ కళ్ళలో

చరణం::2

పెదవి కదలనీ..వలపు బాసకు 
ఓనమాలు..దిద్దించావు
కపటమెరుగని..కన్నెమనసులో 
కలవరింతలే..రేపావు
పెదవి కదలనీ..వలపుబాసకు 
ఓనమాలు..దిద్దించావు
కపటమెరుగని..కన్నెమనసులో 
కలవరింతలే..రేపావు
గోరంత చనువిస్తే..గుండెలో దూరావు
మమతతో ముడివేసి మనసునే దోచావు
వీడని నీడగా నాలోన నిలిచావు     
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
నువ్వు చెప్పకనే అది తెలుస్తుంది 
నీ కళ్ళలో..నీ కళ్ళలో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో
అది ఎప్పటికైన చెప్పక తప్పదు 
నా మనసుతో..నా మనసుతో
ఏదో ఏదో ఏదో..వుంది నీ మనసులో 

No comments: