సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,L.R.అంజలి
తారాగణం::విజయనిర్మల,సావిత్రి, జగ్గయ్య,చంద్రమోహన్,మాడా,అల్లు రామలింగయ్య, ఛాయాదేవి.
పల్లవి::
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బామగారు చిక్కుతారు కౌగిట్లో చిక్కుతారు
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బాబుగారు చిక్కుతారు గుప్పిట్లో చిక్కుతారు
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
చరణం::1
చెలరేగి ఎగిరేవు గాని తలదించుకు కూర్చోవాలి పీటలమీద..ఆహా
చెలరేగి ఎగిరేవు గాని తలదించుకు కూర్చోవాలి పీటలమీద
మెడ వంచక తప్పదులే తాళి కట్టేవేల తాళి కట్టేవేల
తలంబ్రాలు పోసే వేళ తమరే అంటే తలంబ్రాలు పోసే వేళ
తమరే అంటే తర్వాత మన జీవితమంతా మన పాదాల చెంత
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
చరణం::2
ఉబలాటం ఆపండి సారూ బులబాటం దాచుకోండి మీమదిలోనే..ఊహూ
ఉబలాటం ఆపండి సారూ బులబాటం దాచుకోండి మీమదిలోనే
సరసాల వరసలన్ని శోభనం నాడే సరసాల వరసలన్ని శోభనం నాడే
అలక పాన్పు ఎక్కుతాను అప్పుడు చూడు
దాసోహం జీవితమంతా అనిపిస్తాడు మొగుడు
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బామగారు చిక్కుతారు కౌగిట్లో చిక్కుతారు
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
ఈ బాబుగారు చిక్కుతారు గుప్పిట్లో చిక్కుతారు
బాజా భజంత్రీలు మోగుతాయి పందిట్లో
పీపీ పీపీ పిపిపి పిపిపి పిపిపి పిపిపి
No comments:
Post a Comment