సంగీతం::K.V.మహాదేవన్
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ,గుమ్మడి,జగ్గయ్య,పద్మనాభం,విజయనిర్మల,లత, షీలా,
జయమాలిని,రావు గోపాల రావు
పల్లవి::
కన్నులు రెండు పెదవులు రెండు
చెంపలు రెండు చేతులు రెండు కానీ
ఒక్కటే ప్రేమ దానికి లేనేలేదు చిరునామా
కన్నులు రెండు పెదవులు రెండు
చెంపలు రెండు చేతులు రెండు కానీ
ఒక్కటే ప్రేమ దానికి లేనేలేదు చిరునామా
చరణం::1
ఎక్కడో ఎప్పుడో పుడుతుంది అది
ఇంతలోనే అంతంత్తె ఎదుగుతుంది
ఎక్కడో ఎప్పుడో పుడుతుంది అది
ఇంతలోనే అంతంత్తె ఎదుగుతుంది
ఎండలో చలి పుట్టిస్తుంది చలిలో సెగరగిలిస్తుంది
ఎండలో చలి పుట్టిస్తుంది చలిలో సెగరగిలిస్తుంది
ఏముందో ప్రేమలో అది ఎంతకైనా తెగిస్తుంది
కన్నులు రెండు పెదవులు రెండు
చెంపలు రెండు చేతులు రెండు కానీ
ఒకటే ప్రేమ దానికి లేనేలేదు చిరునామా
చరణం::2
ఇ౦టిలో మూగ నోము పట్టిస్తు౦ది
పొదరింటిలో పూలబాసలు చెప్పిస్తుంది
ఇ౦టిలో మూగ నోము పట్టిస్తు౦ది
పొదరింటిలో పూలబాసలు చెప్పిస్తుంది
పెదవులకు కళ్లిస్తుంది కళ్ళతోపలికిస్తుంది
పెదవులకు కళ్లిస్తుంది కళ్ళతోపలికిస్తుంది
ఏముందో ప్రేమలో అది ఎన్నోవింతలు చూపిస్తుంది
కన్నులు రెండు పెదవులు రెండు
చెంపలు రెండు చేతులు రెండు కానీ
ఒకటే ప్రేమ దానికి లేనేలేదు చిరునామా
చరణం::3
నడిరేయి గుండెలోకి చొరబడుతుంది
అలజడిరేపి ఒళ్ళ౦తా ఎగబడుతుంది
నడిరేయి గుండెలోకి చొరబడుతుంది
అలజడిరేపిఒళ్ళ౦తా ఎగబడుతుంది
పగలు రేయిగా మార్చేస్తుంది పలవరింతలు పెంచేస్తుంది
పగలు రేయిగా మార్చేస్తుంది పలవరింతలు పెంచేస్తుంది
ఏముందో ప్రేమలో అది ఏమేమోచేసేస్తుంది
కన్నులు రెండు పెదవులు రెండు
చెంపలు రెండు చేతులు రెండు కానీ
ఒకటే ప్రేమ దానికి లేనేలేదు చిరునామా
లేనేలేదు చిరునామా లేనేలేదు చిరునామా
No comments:
Post a Comment