Saturday, May 23, 2009

రామరాజ్యంలో రక్తపాతం--1976


సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు,వాణిజయరాం
తారాగణం::కృష్ణ,గుమ్మడి,జగ్గయ్య,పద్మనాభం,విజయనిర్మల,లత, షీలా,
జయమాలిని,రావు గోపాల రావు

పల్లవి::

సూదంటు రాయంటి చిన్నోడా 
నీ చూపుచురక లేస్తో౦ది మొనగాడా
సూదంటు రాయంటి చిన్నోడా 
నీ చూపుచురక లేస్తో౦ది మొనగాడా
సంపంగి రెమ్మలా౦టి చిన్నమ్మి
నన్నుచంపబోకే వేరేపనివుంది
సంపంగి రెమ్మలా౦టి చిన్నమ్మి
నన్నుచంపబోకే వేరేపనివుంది

చరణం::1

ఒడ్డు పొడుగుచూసాను 
ఒళ్ల౦తా మరచాను 
ఒపలేనురా మదనతాపం 
నన్నుఒల్లనంటే నీకే౦తో పాపం 
ఒపలేనురా మదనతాపం 
నన్నుఒల్లనంటే నీకే౦తో పాపం
ఒంటిమీద పడతావు అంటకాగి ఉంటావు 
ఒంటిమీద పడతావు అంటకాగి ఉంటావు
ఒచ్చిందే నీతోటి గొడవ 
మళ్ళావొస్తాను పోనీ ఈ తడవ
ఒచ్చిందే నీతోటి గొడవ
మళ్ళావొస్తాను పోనీ ఈ తడవ
సూదంటు రాయంటి చిన్నోడా 
నీ చూపుచురక లేస్తో౦ది మొనగాడా
సంపంగి రెమ్మలా౦టి చిన్నమ్మి
నన్నుచంపబోకే వేరేపనివుంది

చరణం::2

చుక్కలాగ ఉన్నాను చక్కంగ ఉన్నాను 
దక్కించుకోరా నారాజా 
నువ్వు చిక్కుపడితే తాళదు 
ఈ రోజా చుక్కలాగ ఉన్నాను
చక్కంగ ఉన్నాను దక్కించుకోరా నారాజా 
నువ్వు చిక్కుపడితే తాళదు ఈ రోజూ

చరణం::3

వాటమైన పిల్ల యితే మాటతప్పిపోతానా
వీలుచూసి ఈలవేసి కలుస్తా 
వాటమైన పిల్ల యితే మాటతప్పిపోతానా
వీలుచూసి ఈలవేసి కలుస్తా 
నీయవ్వారం ఒక చెయ్యి చూస్తా 
నీయవ్వారం ఒక చెయ్యి చూస్తా
సూదంటు రాయంటి చిన్నోడా 
నీ చూపుచురక లేస్తో౦ది మొనగాడా
సంపంగి రెమ్మలా౦టి చిన్నమ్మి
నన్నుచంపబోకే వేరేపనివుంది

No comments: