సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,చలం,జయసుధ,ప్రభ,కల్పన,సాక్షి రంగారావు.
పల్లవి::
అందాలూ నన్నే పిలిచేలే అనురాగాలూ నాలో విరిసెలే
అందాలూ నన్నే పిలిచేలే అనురాగాలూ నాలో విరిసెలే
కవ్వించే కన్నులతో మురిపించే నవ్వులతో ఆ
అందాలూ నన్నే పిలిచేలే అనురాగాలూ నాలో విరిసెలే
చరణం::1
ఆ కన్నుల చాటున వున్నావీ వలపులా
ఈ మనసుల మాటున వున్నావీ మమతలా
ఆ వలపులు తెలిపే ఊసులూ ఏమిటో
ఈ మనసులు కలిసే వేళలు యెన్నడో
యెన్నెన్నో ఆశలతో యేవేవో బాసలతో
ఆ..అందాలూ నన్నే పిలిచేలే అనురాగాలూ నాలో విరిసెలే
చరణం::2
ఆశల నీడన చల్లగా వుండనీ
ఈ బాసలు నాలో తియ్యగా పండనీ
ఈ యవ్వనమంతా పువ్వులా ఊగనీ
ఈ జీవితమంతా నవ్వుతూ సాగనీ
ఆనందం అనుబంధం నిలవాలి కలకాలం
ఆ..అందాలూ నన్నే పిలిచేలే అనురాగాలూ నాలో విరిసెలే
No comments:
Post a Comment