Monday, May 24, 2010

ప్రేమ బంధం--1976




సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,వాణిశ్రీ,సత్యనారాయణ,రావికొండలరావు,జయమాలిని,జానకి 

పల్లవి::

ఏ జన్మకైనా ఇలాగే ఉందామా 
నేను నీ దాననై నీవు నా ధ్యానమై 
ఇలాఇలాఇలా ఇలాఇలాఇలా 

చరణం::1

నీరెండకే నీ మోము కందిపొవునో 
నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా
నీరెండకే నీ మోము కందిపొవునో 
నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా
నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో 
నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో
నానీలి కురులే తెరలుగా నినుదాచుకోనా 
ఇలా ఇలాఇలా ఇలా ఇలాఇలా

చరణం::2
     
వేయిరాత్రులు కలుసుకున్నా విరిశయ్యకు విరహమెందుకో  
కోటి జన్మలు కలిసి వున్నా తనివి తీరని తపన ఎందుకో 
విరిశయ్యకు విరహమెందుకో తనివి తీరని తపన ఎందుకో
హృదయాల కలయికలో ఉదయించే తీపి 
అది జీవితాల అల్లికలో చిగురించే రూపమది 
ఏ జన్మకైనా ఇలాగే ఉందామా నేను నీదాననై 
నీవు నా ధ్యానమై ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా

No comments: