సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,S,జానకి
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి
పల్లవి::
ఏమని వేడాలీ..శరణం ఎవరిని కోరాలీ..ఈ
దీపముండీ చీకటైతే..దేవుడే కన్నెర్ర జేస్తే
ఏమని వేడాలీ..శరణం ఎవరిని కోరాలీ..ఈ
చరణం::1
మూగవోయిన వీణ..మళ్ళీ రాగ మొలికేనా..ఆ
మోడుబారిన మాను..తిరిగి చివురు తొడిగేనా..ఆ
ఏడుకొండలు స్వామి..కరుణించి నీవే
ఏడుకొండలు స్వామి కరుణించి నీవే..దారి చూపాలీ..ఈ
ఏమని వేడాలీ..ఈ..శరణం ఎవరిని కోరాలీ..ఈ
చరణం::2
శ్రీశైల శిఖరాన..చెలువొందు భ్రమరాంబ
చింతలను బాపేటి..శ్రీ గౌరి జగదాంబ
శ్రీశైల శిఖరాన..చెలువొందు భ్రమరాంబ
చింతలను బాపేటి..శ్రీ గౌరి జగదాంబ
మాపైన నెనరుంచి..మల్లికార్జునునితో
మా మొర వినిపింపుమా..ఆఆఆ
ఏమని వేడాలీ..శరణం ఎవరిని కోరాలీ..ఈ
No comments:
Post a Comment