Wednesday, May 27, 2009

విజయం మనదే--1970




సంగీతం::ఘంటసాల
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

ఓ......దేవి.....ఏమి కన్నులు నీవి
ఓ......దేవి.....ఏమి కన్నులు నీవి
కలకల నవ్వే కలువలు....అవి
కాముని పున్నమి చలువలు

ఓ......దేవి.....ఏమి కన్నులు నీవి

వాడిపోయే, వీడిపోయే కొలనులోని
కలువపూలు నా నయనాలా..
చాలు....చాలు....చాలు....

ఓ.....దేవి.....ఏమి కన్నులు నీవి

చరణం::1

ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు
ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు

రూపమే కాని రుచియేలేని పగడాలు
రూపమే కాని రుచియేలేని పగడాలు
తేనియలూరే తీయని పెదవికి సరిరావు
సరిరావు చాలు.. చాలు.. చాలు..

ఓ......దేవి.....ఏమి కన్నులు నీవి

చరణం::2

ఆ....ఆ....ఆ....ఆ..

కులుకుల నడకల కలహంసలు కదలాడెనా..
నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా
కులుకుల నడకల కలహంసలు కదలాడెనా..
నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా
దివికు భువికి వంతెన వేసెను మీ మనసు
దివికు భువికి వంతెన వేసెను మీ మనసు

అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను నీ మనసు
నీ మనసు చాలు....చాలు....చాలు


ఓ......దేవి.....ఏమి సొగలులు నీవి
ఓ......రాజా....రసికతా రతి రాజా

ఇద్దరు::ఆహ హా హా హ హా హా..........

No comments: