సంగీతం::R.సుదర్శనం
రచన::అనిశెట్టి
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,K.R.విజయ,బేబి రాణి,జ్యోతిలక్ష్మి,పద్మనాభం,రేలంగి.
పల్లవి::
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ
నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చరణం::1
ముచ్చట తీరా శింగారించేనా
ముచ్చట తీరా శింగారించేనా
మురిపెం మీరా నిను ముద్దాడేనా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చరణం::2
గోముగ నీకు గోరుముద్దలే తినిపించేనమ్మా
ఒడినే చల్లని ఊయల చేసి లాలించేనమ్మా
గోముగ నీకు గోరుముద్దలే తినిపించేనమ్మా
ఒడినే చల్లని ఊయల చేసి లాలించేనమ్మా
నందనవనమూ నవయవ్వనమూ పువ్వులుగా విరిసే
కలలే చెదిరి కన్న హృదయమే కన్నీరై కురిసే
ఆశలు గొలుపూ ఆ తొలి వలపూ
జీవిత ఫలమూ ఇది ఆ దేవుని వరమూ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
చరణం::3
ఆకాశంలో కోటి తారలను భువికే పిలిచేనూ
అనురాగంతో ముద్దు పాపకూ హారతులొసగేనూ
ఆకాశంలో కోటి తారలను భువికే పిలిచేనూ
అనురాగంతో ముద్దు పాపకూ హారతులొసగేనూ
తల్లి దీవెనే కన్నబిడ్డకూ వీడని నీడౌనూ
కల్లా కపటం ఎరుగని వారికి దేవుడే తోడౌనూ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
నా జాబిల్లీ నీవే బంగరు తల్లీ
చిట్టి పాపా చిరునవ్వుల పాపా
No comments:
Post a Comment