Friday, June 07, 2013

బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::ఆరుద్ర
గానం::S.జానకి,B.వసంత
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

యవ్వనం చక్కని పువ్వురా
వయసంతా మజా చేయరా..ఆ
అదిపోతే..మరిరాదురా..ఆ                           
యవ్వనం చక్కని పువ్వురా..ఆ
వయసంతా మజా చేయరా..ఆ
అదిపోతే..మరిరాదురా..ఆ                           
యవ్వనం చక్కని పువ్వురా..ఆ

చరణం::1

ప్రతిపువ్వు గుబాళించినా
ప్రతినవ్వు నివాళించదోయ్
ఆ..ప్రతిపువ్వు గుబాళించినా
ప్రతినవ్వు నివాళించదోయ్
నా సొగసే..ఏ..నా సొగసే 
గులాబి అది నీకై వేచెరా..ఆ
యవ్వనం చక్కని పువ్వురా..ఆ                           

చరణం::2

భువిలోనె సుఖం వుందిరా..ఆ 
జవరాలే పసందౌనురా..ఆ
భువిలోనె సుఖం వుందిరా..ఆ 
జవరాలే పసందౌనురా..ఆ
చవిచూస్తే..ఏ,,ఆఆ..చవిచూస్తే 
నిజంగా నను వీడలేవురా..ఆ
యవ్వనం చక్కని పువ్వురా..ఆ                         

చరణం::3

మధువందే నిషా వున్ననూ..ఆ
మనముందు బలాదూరురా..ఆ 
మధువందే నిషా వున్ననూ..ఆ
మనముందు బలాదూరురా..ఆ 
మనసైతే మనసైతే దిగిపోని..ఆ 
బల్ మైకం..మ్మ్..యిస్తారా..ఆ       
యవ్వనం చక్కని పువ్వురా..ఆ
వయసంతా మజా చేయరా..ఆ

No comments: