Thursday, April 23, 2015

అభినందన--1988


సంగీతం::ఇళయరాజ
రచన::ఆచార్య-ఆత్రేయ 
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

ఆ..ఆఆఆ..ఆఆఆ..మ్మ్ మ్మ్ హూ..
మ్మ్ హూ..మ్మ్ హూ..మ్మ్ హూ..ఆ ఆ ఆ
లలలలలలలల 

రంగులలో కలవో యద పొంగులలో కళవో 
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఉయలవో
రంగులలో కలవో..యద పొంగులలో కళవో

చరణం::1

కాశ్మీర నందన సుందరివో 
కాశ్మీర నందన సుందరివో 
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో..ఆ 
ఆమని పూచే యామినివో..ఆ
మధుని బాణమో మదుమాస గానమో..ఆహా
నవ పరిమళాల పారిజాత సుమమో..ఆహా

రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై 
నీ ఊహలా ఊగించనా..రంగులలో కలనై

చరణం::2

ముంతాజు అందాల దానివో 
ముంతాజు అందాల దానివో 
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో  
లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో

రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై ప్రతిరూపాంగినై నీ ఊహలా ఊరించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై

No comments: