Wednesday, April 15, 2009

చిన్ననాటి స్నేహితులు--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల 

పల్లవి::

సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా

సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీరస్తూ శుభమస్తూ..సుపుత్ర ప్రాప్తిరస్తూ తథాస్తూ 

చరణం::1

వేదగానమే వినువీధులంటగా
మంగళ నాదాలు ముంగిట మ్రొయగా 
వేదగానమే వినువీధులంటగా
మంగళ నాదాలు ముంగిట మ్రొయగా 
శ్రీవాణి వీణియ సవరించగా
శ్రీవాణి వీణియ సవరించగా
శ్రీగౌరి సుభగీతి వినిపించగా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా

చరణం::2

కరముల రతనాల గాజులు తొడిగీ
శిరమున ముత్యాల అక్షితలు చల్లి 
కరముల రతనాల గాజులు తొడిగీ
శిరమున ముత్యాల అక్షితలు చల్లి 
ముత్తైదువలే హారతులివ్వగా
ముత్తైదువలే హారతులివ్వగా
ముక్కోటి దేవతలు దీవించగా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
సీతమ్మ తల్లికి సీమంతమమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీదేవి భూదేవి దీవింతురమ్మా
శ్రీరస్తూ శుభమస్తూ..సుపుత్ర ప్రాప్తిరస్తూ తథాస్తూ

No comments: