సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
సా..రీ..గా..మా..పా..దా..నీ
సా నీ..దా..పా..మా..గ..రీ
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా
నీలాంబరి..నేరేడు..గురివింజా
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా
నీలాంబరి..నేరేడు..గురివింజా
ఏడు రంగుల వలువలు
ఏడస్వరముల మెరుగులు
ఏడందాలు వెలిగే ముగ్గులేయాలీ
ఏడేడు లోకాలు మురిసిపోవాలీ
సా..రీ..గా..మా..పా..దా..నీ
సా నీ..దా..పా..మా..గ..రీ
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా
నీలాంబరి.. నేరేడు..గురివింజా
ఏడురంగుల..వలువులు
ఏడశ్వాల...పరుగులు
ఏడడగులు వేసి..అందుకోవాలీ
ఏడేడు జన్మలకు..కలసి వుండాలీ
సా..రా..గా మా..పా..ద..నీ..సా..నీ
దా..పా..మా..గ..రీ..సా..ఆ..ఆ..ఆ
చరణం::1
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కూనిరాగం తీస్తుంటే..కొండగాలి వీస్తుంటే
కునుకెంత ఎరుపెక్కి..కొండెక్కి పొడిచింది
తొలిరేకల తళతళలూ..ఊ..ఊ..నులివేడి తలుపులతో
గుండెలోన వెండి గిన్నే..నిండి నింగి పొంగింది
మోజు పెంచే రాజహంస..రోజూ రోజూ ఇదే వరస
మోజు పెంచే రాజహంస..రోజూ రోజూ ఇదే వరస
వేకువందున తనివి తీరా..నిన్ను చూస్తానూ
నిన్ను తప్ప లోకమంతా..మరచిపోతానూ
సా..రా..గా..మా.పా..ద..నీ..సా..నీ
దా..పా..మా..గ..రీ..సా..ఆ..ఆ..ఆ
చరణం::2
మనసేమో మందారం..పలుకేమో బంగారం
కోరుకున్న చందమామ..ఓరు చూపు కలిపాడూ
జాజీ నీ తెలుగుతనం..జవరాలై వెలిసిందీ
జిగినించే నగుమోము..మమకారం చిలికింది
గోడ చాటు గోరువంక..ఇంటిముందు రామచిలుక
గోడ చాటు గోరువంక..ఇంటిముందు రామచిలుక
నింగిలోన గాలిమేడ..నిజం కావాలీ
అందులోనే నువ్వు నేను ఆడుకోవాలీ
సా..రా..గా..మా.పా..ద..నీ..సా..నీ
దా..పా..మా..గ..రీ..సా..ఆ..ఆ..ఆ
పసుపు కెంపు..ఆకుపచ్చ నారింజా
నీలాంబరి..నేరేడు గురివింజా
ఏడురంగుల..వలువులు
ఏడశ్వాల...పరుగులు
ఏడడగులు వేసి అందుకోవాలీ
ఏడేడు జన్మలకు కలసి వుండాలీ
సా..రా..గా..మా.పా..ద..నీ..సా..నీ
దా..పా..మా..గ..రీ..సా..ఆ..ఆ..ఆ
No comments:
Post a Comment