Wednesday, April 15, 2009

ఇంద్ర ధనుస్సు --1978







సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::SP.బాలసుబ్రమణ్యం


నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తలవాకిటిలో
పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక
అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది
నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని...

పూట పూట నీ పూజ కోసమని
పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోట్టగా
ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని...

పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా
నీ చెవిన పడితే చాలునని
నా జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిసేలోగా నివురైపోతాను
నేనొక ప్రేమ పిపాసిని...

No comments: