సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::చిరంజీవి,రాధిక,భానుప్రియ,
పల్లవి::
కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపురగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది
కౌగిలింతలోనే..హెయ్..హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపురగిలి కోరగనే
చరణం::1
వానొచ్చి తడిసాక వయసెంతొ తెలిసింది..తొలిసారిగా..ఆ
నీవొచ్చి కలిసాక మనసంటె తెలిసింది ఒక లీలగా..ఆ
ఆ గాలి వానల్లె కలిశాము..ఎద మంటల్లొ చలి గుళ్ళో చేరాము
మెరుపల్లె ఉరుమల్లె కలిశాము..తొలివయసుల్లో వడగల్లె ఏరాము
మనం మనం..ఊ..ఊ
మనం మనం..వరించడం..తరించడం..ఇహం పరం
క్షణం క్షణం..నిరీక్షణం..సుఖం సుఖం
లలల..కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపురగిలి కోరగనే
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
కౌగిలింతలోనే..హెయ్..హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపురగిలి కోరగనే
చరణం::2
వాటేసుకుంటేనే వయసొచ్చే..ఈ సందే సందిల్లల్లో..హోయ్
వయ్యారి అందాలు..వరదల్లె పొంగేటి కౌగిల్లలో..హా
సూరీడు వెళ్ళాక..సాయంత్రం
తొలి నా ఈడు కోరింది..నీ మంత్రం
చుక్కల్తో వచ్చింది..ఆకాశం
చలి చూపుల్లో తెచ్చింది..ఆవేశం
ప్రియం..ప్రియం..ఉ..ఉ
ప్రియం..ప్రియం..జతిస్వరం
పరస్పరం..స్వయంవరం
నరం నరం..ఒకే స్వరం..నిరంతరం..తరార
కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులిగిరి వలపురగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది
కౌగిలింతలోనే..హెయ్..హేయ్
కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిసి వలపురగిలి కోరగనే
No comments:
Post a Comment