Sunday, March 06, 2011

చైర్మన్ చలమయ్య--1974















సంగీతం::సలీల్ చౌదరి
రచన:: ఆరుద్ర
గానం::P.సుశీల 
తారాగణం::చలం,విజయలలిత,ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య 

పల్లవి::

హలో చైర్ మన్ గారూ..హలో చైర్ మన్ గారూ 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు
ఆ హలో చైర్ మన్ గారూ..ఊ

చరణం::1

తొలి చూపులోనే నేను..తెలుసుకొంటి నీలో మనసు 
జనం మేలు కోరే నీవు..జయించేవు అందరి మనసు 
హాహా..తొలి చూపులోనే నేను..తెలుసుకొంటి నీలో మనసు 
జనం మేలు కోరే నీవు..జయించేవు అందరి మనసు 
నవజగతికి నాంది పలికేవు..పలికేవు సనిద నిదప దసరిమగరిస 
హలో చైర్ మన్ గారూ..హలో చైర్ మన్ గారూ 
అందుకోండి నా జోహారు..ఆ..హలో చైర్ మన్ గారూ

చరణం::2

కలలాగ కమ్మగ చేరి..ఎదలోన నెలకొన్నావు 
కలలోని ఆశాలతలు..కళ్ళముందు పండించావు 
కలలాగ కమ్మగ చేరి..ఎదలోన నెలకొన్నావు 
కలలోని ఆశాలతలు..కళ్ళముందు పండించావు 
ఫలియించిన పరువాలన్నీ..పరవశాన తేలించావు 
నా సొగసులు వేణువులైతే..మనోరధం వీణగమారె హ హ హ 
ఫలియించిన పరువాలన్నీ..పరవశాన తేలించావు 
నా సొగసులు వేణువులైతే..మనోరధం వీణగమారె
అనురాగ సరాలే మీటావు..మీటావు సస్స నపస 
నగసపమగమమదమమదనిదదనిదపదనిదసస..ఆ ఆ ఆ 
హ హ హ హ..హలో చైర్ మన్ గారూ 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు 
హలో చైర్ మన్ గారూ..అందుకోండి నా జోహారు 
హలో చైర్ మన్ గారూ..ఊఊఊ  

No comments: