సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,వాణిశ్రీ,S.V.రంగారావు,జగ్గయ్య,రమణారెడ్డి,విజయలలిత,జ్యొతిలక్ష్మీ
పల్లవి::
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
మురిసె ఇలాటి వేళ..నేడే సుఖాల తేల
ఓహో..గులాబి బాలా..రావేలా
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
మురిసె ఇలాటి వేళ..నేడే సుఖాల తేల
నీదే గులాబి బాలా..రావేలా
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
చరణం::1
హంసలై నింగిలో..ఎగిరిపోదాములే
మబ్బులై గాలిలో..తేలిపోదాములే
హంసలై నింగిలో..ఎగిరిపోదాములే
మబ్బులై గాలిలో..తేలిపోదాములే
అల్లుకున్న ఆశలన్నీ..పల్లవించాలిలే
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
చరణం::2
ఏకమై లోకమే..మరచిపోదాములే
యవ్వనం చెరిసగం..పంచుకుందాములే
ఏకమై లోకమే..మరచిపోదాములే
యవ్వనం చెరిసగం..పంచుకుందాములే
జీవితం పాటగా..పాడుకుందాములే
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
చరణం::3
మమతలే మల్లెలై..విరబూసేనులే
వలపులే వెల్లువై..పొంగిపోయేనులే
మమతలే మల్లెలై..విరబూసేనులే
వలపులే వెల్లువై..పొంగిపోయేనులే
నీవునాలో నేనునీలో..నిండిపోవాలిలే
నీవేలే నా కంటి పాపలో..నేనేలే నీ పాలనవ్వులో
మురిసె ఇలాటి వేళ..నేడే సుఖాల తేల
ఓహో..గులాబి బాలా..రావేలా
No comments:
Post a Comment