Thursday, March 29, 2012

ప్రెసిడెంట్ పేరమ్మ--1979



సంగీతం::చక్రవర్తి
రచన::సినారె
గానం::S.P. బాలు, P.సుశీల 
Film Directed By::K.Viswanaath
తారాగణం::నూతన్ ప్రసాద్,కవిత,రాజబాబు,రమాప్రభ,మంజు భార్గవి,K.V. చలం,సాక్షి రంగారావు

పల్లవి::

హే..అందరాని..సందమామ 
నాకెందుకూ..ఊ..ఊ..ఊ..ఊ
అద్దం లాంటి నామామ..చాలు నాకు
అద్దంలాంటి నామామ..చాలునాకు

హే..అందరాని..సందమామ 
నీకెందుకూ..ఊ..ఊ..ఊ..ఊ
నే అద్దంలా ఉన్నాను..నువ్వు సూసేందుకు
నే అద్దంలా ఉన్నాను..నువ్వు సూసేందుకు

చరణం::1

ఏటిలోని..నురగల్లాగా
పైట కొంగు..పొంగుతుంటే
లేత గాలి..ఇసురుల్లోనా
పూత వయసు..ఊగుతుంటే

ఇసకతిన్నెలు..గుసగుసమంటే
ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ
మసకా కోరిక..బుస కొడుతుంటే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఇసకాతిన్నెలు..గుసగుసమంటే
మసకా కోరిక..బుస కొడుతుంటే

చూడాలి..అప్పుడు
ఈ జోడు గుండెల..చప్పుడు
చూడాలి..అప్పుడు
ఈ జోడు గుండెల..చప్పుడు

హా..అందరాని..సందమామ 
నీకెందుకూ..ఊ..ఊ..ఊ..ఊ
అద్దం లాంటి నా మామ..చాలు నాకు
అద్దం లాంటి నా మామ..చాలు నాకు

చరణం::2

నీరెండ..సీరకట్టి
నీలి నీడ రైక..తొడిగి
పొద్దుపొడుపు..తిలకం దిద్ది
పొన్న పూల..నవ్వులు పొదిగి

వనలచ్చిమిలా..నువ్వొస్తుంటే
ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ
ఊరూ నాడు..పడి చస్తుంటే
హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
వనలచ్చిమిలా..నువ్వొస్తుంటే
ఊరూ నాడు..పడి చస్తుంటే

చూడాలి..అప్పుడు 
నన్నేలినోడి..దూకుడు
చూడాలి..అప్పుడు
నన్నేలినోడి..దూకుడు

హే..అందరాని..సందమామ 
నీకెందుకూ..ఊ..ఊ..ఊ
నే అద్దంలా..ఉన్నాను
నువ్వు..సూసేందుకు

హే..అందరాని..సందమామ 
నాకెందుకూ..ఊ..ఊ..ఊ
అద్దం లాంటి నా మామ..చాలు నాకు
అద్దం లాంటి నా మామ..చాలు నాకు

No comments: