Saturday, March 08, 2014

మహాత్ముడు--1976::భీంపలాస్::రాగం

 
సంగీతం::T.చలపతిరావు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,శారద,ప్రభ,G.వరలక్ష్మి,జయమాలిని,సత్యనారాయణ,
కాంతారావు,అల్లు రామలింగయ్య
భీంపలాస్::రాగం  

పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఒహో..ఒహో..ఒహో..ఓఓఓ 
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం
చల్లగా తల్లిలా చల్లగా తల్లిలా లాలి౦చే ఈ నందనం
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం

చరణం::1

పూర్ణచంద్ర మణికాంతులే..నయనాలుగా
ఉదయ సూర్యకిరణాలే..చరణాలుగా
పూర్ణచంద్ర మణికాంతులే..నయనాలుగా
ఉదయ సూర్యకిరణాలే..చరణాలుగా
అవతరించిన అందగాడే..అవతరించిన అందగాడే
బ్రతుకు తోటలో..పదం మోపితే

ఎంత మధురం ఆ క్షణం..ఎంత తీయని అనుభవం           
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం
చల్లగా తల్లిలా చల్లగా తల్లిలా లాలి౦చే ఈ నందనం
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం

చరణం::2

సుందర దరహాసాలే..సుమదళాలుగా
సురచిర మృదు భావలే..పరిమళాలుగా
సుందర దరహాసాలే..సుమదళాలుగా
సురచిర మృదు భావలే..పరిమళాలుగా
నవనవలాడే నవవసంతుడే..నవనవలాడే నవవసంతుడే
నన్నే వలచి..నా వాడైతే

ఎంత మధురం ఆ క్షణం..ఎంత తీయని అనుభవం           
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం
చల్లగా తల్లిలా..చల్లగా తల్లిలా లాలి౦చే ఈ నందనం
ఎంత మధురం ఈ క్షణం..ఎంత తీయని అనుభవం

No comments: