సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::దాశరథి
గానం::P.సుశీల, B.వసంత
పల్లవి::
నిజం చెప్పవే పిల్లా..ఎలాగుంది ఈ వేళ
నీకెలాగుంది ఈ వేళ
నిజం చెప్పవే పిల్లా..ఎలాగుంది ఈ వేళ
నీకెలాగుంది ఈ వేళ
ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది
ఏమి చెప్పనే పిల్లా భలేగుంది ఈ వేళ
అహ భలేగుంది ఈ వేళ.......
చరణం::1
చిలిపి వయసు కవ్వించే..మనసు చిలికి మురిపించే
ఆ ఆ ఆ ఒ ఒ ఒ ఒ ..........
చిలిపి వయసు కవ్వించే మనసు చిలికి మురిపించే
నీ కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో
నీ కన్నుల వాలులో సరదాలు పొంగే జోరులో
సంబరాలతో సరాగాలతో సాగిపోదమా..ఆఆ
నిజం చెప్పవే పిల్లా..ఎలాగుంది ఈ వేళ
నీకెలాగుంది ఈ వేళ
చరణం::2
నాలో వెలిగే దీపం నీ చిరునవ్వు చిందే రూపం
నాలో వెలిగే దీపం నీ చిరునవ్వు చిందే రూపం
నీ కాంతిలో ఈ శాంతిలో ఈ లోకమే స్వర్గము
నాలో వెలిగే దీపం...
ఆ ఆ ఆ ఆ ఆఓఓఓఓఓఓఓఓఓ
నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత
ఆ ఆ ఆ ఆ ఆఓఓఓఓఓఓఓఓఓ
నిన్న లేని పులకింత కన్నెపిల్లకో వింత
పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేసెనే
పాలబుగ్గలు మీటితే తొలి ప్రేమ మొగ్గలు వేసెనే
ఏల సిగ్గులే ఏమి నిగ్గులే మాకు తెలుసులేవే..ఏఏఏ..
నిజం చెప్పవే పిల్లా..ఎలాగుంది ఈ వేళ
నీకెలాగుంది ఈ వేళ
చరణం::3
రాగం భావం నీవే..నా అనురాగ గీతం నీవే
రాగం భావం నీవే..నా అనురాగ గీతం నీవే
నీ ప్రేమలో నే లీనమై..జీవించుటే స్వర్గము
రాగం భావం నీవే..
No comments:
Post a Comment