సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::కృష్ణంరాజు,జగ్గయ్య,రాజబాబు,పద్మనాభం,శారద,భారతి,రమాప్రభ,నిర్మల,హలం
పల్లవి::
అటు తుదిజాములో పొద్దువాలిందిలే
ఇటు తొలిపొద్దు...పొడిచిందిలే
అటు తుదిజాములో పొద్దువాలిందిలే
ఇటు తొలిపొద్దు...పొడిచిందిలే
అది మనిషిని బంధించే చెరసాల
ఇది మనసును విడిపించే మధుశాల..మధుశాల
అటు తుదిజాములో పొద్దువాలిందిలే
ఇటు తొలిపొద్దు...పొడిచిందిలే
చరణం::1
ఈ కళ్ళలో నీలివాకిళ్ళలో..చూపులే ఆరవేసేరు కొందరు
ఈ మేనిలో మెరిసే మెరుపులో..మనసే జారవిడిచేరు కొందరు
ఈ నడకలో పలికే అడుగులో..పులకించిపోని
తలవంచలేని వారెవ్వరు..ఎవ్వరు ఎవ్వరు ఇంకెవ్వరు
అటు తుదిజాములో...పొద్దువాలిందిలే
ఇటు తొలిపొద్దు...పొడిచిందిలే
చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆఆ ఆఆ ఆఆ ఆఆ
పోగొట్టుకున్నవారు...ఎదో పొందగా
వస్తారు పొందినవారేమో పోగొట్టుకొని పోతారు
బ్రతుకులో చేదుందనీ పారిపోయి వస్తారు
చెలి..అందించే చేదుని...మింగి
చెలి..అందించే చేదుని...మింగి
బలే తీపు అంటారు బలే తీపు అంటారు
ఈ తీపిలో పెరిగే కైపులో రుచిమరిగిపోయి
ఇటు తిరిగిరాని వారెవ్వరు..ఎవ్వరు ఎవ్వరు ఇంకెవ్వరు
మ్మ్ మ్మ్ మ్మ్
No comments:
Post a Comment