Wednesday, February 09, 2011

తిరుపతి--1974



సంగీతం::చరవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::S.P.బాలు 
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య

పల్లవి::

ఏడుకొండలవాడు..ఎంకన్న ఎంకన్న
ఏమీ లేనివాడు..ఈ అన్న ఓ రన్న
చల్లంగ చూశాడు..ఆ సామి ఎంకన్న
చెల్లాయి పెళ్ళి..చేశాడు ఈ అన్న   

చరణం::1

సీతమ్మే మా చెల్లెమ్మా..ఆ
రామయ్యే మా..బావయ్యా..ఆ    
పల్లకిలో వారు..ఊరేగుతుంటే
బాజాలు బాకాలు..మోగుతువుంటే
పైనుండి మా నాన్న..చూస్తాడు
నన్ను మొనగాడినని..మెచ్చుకుంటాడు..ఆహా   
ఏడుకొండలవాడు..ఎంకన్న ఎంకన్న 
చల్లంగ చూశాడు..ఆ సామి ఎంకన్న
చెల్లాయి పెళ్ళి..చేశాడు ఈ అన్న   

చరణం::2

వస్తాను చెల్లెమ్మా..వెళ్ళొస్తాను బావయ్యా
ఏమీ తెలియని..నా చిట్టి చెల్లిని
లోకం ఎరుగని..ఈ పిచ్చి తల్లిని
నీ చేతిలో పెట్టి..వెళుతున్నాను
నా చేతికెన్నడు..ఇస్త్తావొ బాబును 

చరణం::3

వచ్చాయి నా...పోలికలు
ఇక రావాలి మన..తెలివితేటలు
నా అంతవాడివి..కావాలిరా
ఊరంత నిన్ను చూసి..అదరాలిరా
ఊరంత నిన్ను చూసి..అదరాలిరా
ఆహా.. 
ఏడుకొండలవాడు..ఎంకన్న ఎంకన్న
ఏమీ లేనివాడు..ఈ అన్న ఓ రన్న  
చల్లంగ చూశాడు..ఆ సామి ఎంకన్న
అల్లుణ్ణి ఇచ్చాడు..నా సామి ఎంకన్న
చల్లంగ చూశాడు..ఆ సామి ఎంకన్న

No comments: