Monday, July 28, 2014

లంబాడోళ్ళ రాందాసు--1978




సంగీతం::S రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర 
గానం::ఘంటసాల, S.జానకి  
తారాగణం::చలం,రోజారమణి, జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,పండరీబాయి,రాజబాబు,
రావు గోపాల రావు,జయలక్ష్మి

పల్లవి::

నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా 
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా 
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా 
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా 
ఓ ఓ..ఓ..

చరణం::1

తలచినదీ ఒకటైతే జరిగినదీ వేరొకటీ 
తలచినదీ ఒకటైతే జరిగినదీ వేరొకటీ 
చితికినదీ నీ మనసూ అతుకుటకూ లేరెవరూ 
నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా 
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా 

చరణం::2

గుండెలలో గునపాలూ గుచ్చారే నీ వాళ్ళూ 
గుండెలలో గునపాలూ గుచ్చారే నీ వాళ్ళూ 
కన్నులలో గోదారీ కాలువలే కట్టిందీ 

నీ ఆశా అడియాసా చెయ్ జారే మణిపూసా 
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా 
బ్రతుకంతా అమవాసా లంబాడోళ్ళ రాందాసా 

No comments: