Showing posts with label డ్రైవర్ రాముడు--1979. Show all posts
Showing posts with label డ్రైవర్ రాముడు--1979. Show all posts

Monday, July 28, 2014

డ్రైవర్ రాముడు--1979::ఆభేరి::రాగం


సంగీతం::K.చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల 
 తారాగణం::N.T.రామారావు,జయసుధ,రోజారమణి,కైకాల సత్యనారాయణ,జయమాలిని,మోహన్‌బాబు.
ఆభేరి::రాగం 

పల్లవి::

ఏమని వర్ణించనూ..ఏమని వర్ణించనూ
నీకంటి వెలుగును..వెన్నంటి మనసును
వెన్నెల నవ్వునూ..నీ ఇలవేల్పును
ఏమని వర్ణించనూ..ఉ..

ఆ..ఆహహ..ఆ

పైరగాలిలాగా చల్లగా ఉంటాడు
తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు

తీర్చిన బొమ్మలా తీరైనవాడూ 
తీర్చిన బొమ్మలా తీరైనవాడూ
తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు
ఏమని వర్ణించనూ..ఊ..

చరణం::1

రాముడు కాడమ్మా..నిందలు నమ్మడూ
కృష్ణుడు కాడమ్మా..సవతులు ఉండరూ
నువ్వు పూజించు దేవుళ్ల..లోపాలు లేనివాడు
నీ పూజ ఫలియించి..నీ దేవుడైనాడు
నీ పూజ ఫలియించి..నీ దేవుడైనాడు
ఏమని వర్ణించనూ..ఊ..

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా
తన కళ్లతో జగతి చూపించగలడమ్మా
కళ్లు లేవనీ నీకు కలతింక వలదమ్మా
తన కళ్లతో జగతి చూపించగలడమ్మా

ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
ఆ దేవుడెదురైతే వేరేమి కోరను
నా అన్న రూపాన్ని చూపితే చాలును
ఏమని ఊహించనూ నా అన్న రూపునూ
నాకున్న వెలుగును వెన్నంటి మనసునూ
నా ఇలవేల్పును..ఏమని ఊహించనూ..ఊ..

Wednesday, August 10, 2011

డ్రైవర్‌ రాముడు--1979




సంగీతం::K.చక్రవర్తి 
రచన::వీటూరి
గానం::S.P.బాలు, P.సుశీల 
 తారాగణం::N.T.రామారావు,జయసుధ,రోజారమణి,కైకాల సత్యనారాయణ,జయమాలిని,మోహన్‌బాబు. పల్లవి::

దొంగా..ఆ..ఆ..అమ్మో..ఓ
అరెరెరె..వంగమాకు..వంగమాకు
వంగి..వంగి దొంగలాగ పాకమాకు 
వంగమాకు..వంగమాకు
వంగి..వంగి దొంగలాగ పాకమాకు 
వంగుతుంటే కొంగులోని..గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ 
వంగమాకు

లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు 
లాగమాకు..ఆహ..లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు 
లాగుతుంటే కొంగు చాటు..గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు

చరణం::1

ఈతముళ్ళు..అబ్బా..గుచ్చుకుంటే..అమ్మో 
పువ్వులాంటి లేత వళ్ళు గాయం
ఈతముళ్ళూ..ఊ..ఊ గుచ్చుకుంటే..ఏ
పువ్వులాంటి లేత వళ్ళు గాయం 
తోటమాలి చూశాడా..ఆ..ఆ..బడితపూజ కాయం

మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే
డండఢ డాఢ డడడడ దణ్డడ..డండడ..డడ 
మాలి నాకు మామేలే..తోట కూడ మాదేలే 
ముల్లయినా నన్ను తాకి పువ్వయిపోతుందిలే
రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో..ఆహా 
రామయ్యో..ఓ..ఓ..వెళ్ళి రావయ్యో అరెరెరె 

వంగమాకు..ఓహో..వంగమాకు
వంగి..వంగి దొంగలాగ పాకమాకు 
అమ్మమ్మమ్మామ్మ్ 
లాగమాకు..ఓహో..లాగమాకుఆహాహా
లాగిలాగి పైటకొంగు జారనీకు 

చరణం::2

చేను మీద చొరవచేస్తే..చెంపమీద చేతి ముద్ర ఖాయం 
చేను మీద అహ్హా..చొరవచేస్తే..ఓహ్హో..చెంపమీద చేతి ముద్ర ఖాయం 
నేను గొడవ చేశానా..ఆ..ఆ..ఆ..ఆ..ఎవరు నీకు సాయం

ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే
డడ్డర డడ్డడడ్డా..డడ్డర డడ్డడడ్డా
ఆడ చెయ్యి తగిలితే..హాయి నాకు కలిగితే
వంగ తోటలో సరసం..వరసే అవుతుందిలే..ఏ 

చుక్కమ్మో..ఓ..ఓ..ఓ..నాకు చిక్కమ్మో
వ్వె..వ్వే..వ్వే..వ్వే..ఆ చుక్కమ్మో నాకు చిక్కమ్మో



వంగి..వంగి దొంగలాగ పాకమాకు 
వంగమాకు..వంగమాకు
వంగి..వంగి దొంగలాగ పాకమాకు 
వంగుతుంటే కొంగులోని..గుట్టంత రట్టమ్మో చుక్కమ్మా..ఓ..ఓ 
వంగమాకు

లాగమాకు లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు 
లాగమాకు..ఆహ..లాగమాకు లాగిలాగి పైటకొంగు జారనీకు 
లాగుతుంటే కొంగు చాటు..గుట్టంత రట్టయ్యో రామయ్యో..ఓ..ఓ..లాగమాకు

Tuesday, August 10, 2010

డ్రైవర్‌ రాముడు--1979



సంగీతం::K.చక్రవర్తి 
రచన::వీటూరి
గానం::S.P.బాలు,P.సుశీల 
 తారాగణం::N.T.రామారావు,జయసుధ,రోజారమణి,కైకాల సత్యనారాయణ,జయమాలిని,మోహన్‌బాబు.

పల్లవి::

ఆ రైట్..రైట్

మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..ఏ..ఏ
మావిళ్ళ తోపు కాడ పండిస్తే..ఏ..ఏ
మరుమల్లె తోట కాడ పువ్విస్తే..ఏ..ఏ
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే

నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..ఏ
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..ఏ
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే

పాం..పాం..బాయ్..బాయ్..పాం..పాం..బాయ్..బాయ్

చరణం::1

ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా..ఆ
ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా..ఆ..ఆ
సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా..ఆ
ఈ పిట్ట పొగరు చూడవేమే..ఏ..ఏ..ఏ వయసులోనా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మునిమాపు వేళకొస్తే..ముడుపులన్ని కట్టేస్తా..ఆ
చుక్కపొడపు చూసి వస్తే..మొక్కులన్నీ తీరుస్తా..ఆ
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ..ఆ
వలపులన్నీ వడ్డిస్తా..వయసు వడ్డి చెల్లిస్తా..ఆ

ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే..ఏ
అమ్మమ్మో..ఎత్తికుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
పాం..పాం..బాయ్..బాయ్..పాం..పాం..బాయ్..బాయ్

చరణం::2

ఏడు నెలవలెత్తు ఉన్న కోడెగాడా..ఆ..ఆ..ఆహా
నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా..ఓహోహో
దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా..ఆ
నీ ట్రక్కు జోరు ఈడ కాదూ..ఊ..ఊ..ఇంటికాడ

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పంట కెదిగే..వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా..ఆ
జంటకొదిగే సొగసులన్నీ..ఇప్పుడే నే కాజేస్తా..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ..ఆ
వయసు నేనయి వాటేస్తా..మనసులోనే చోటిస్తా..ఆ

ఎత్తుకుదేశాడే..అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
అమ్మమ్మమ్మ..ఎత్తుకుదేశాడే..అబ్బాడి దెబ్బ 
చిత్తు చిత్తు చేశాడే..హ్హే..హ్హే..హ్హే

నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..ఏ
నిమ్మకూరు రోడ్‌దాటి నీవొస్తే..ఏ..ఏ
నిడమోలు లాకు కాడ ఆపేస్తే..ఏ..ఏ
ఏలికేస్తే కాలికేసి..కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె..ముద్దిచ్చిపోవేమే..బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే

పాం..పాం..బాయ్..బాయ్..పాం..పాం..బాయ్..బాయ్