Friday, July 11, 2014

అమ్మ మనసు--1974



సంగీతం::K.V.మహాదేవన్
రచన::దేవులపల్లికృష్ణ శాస్త్రి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభK.విజయ,చలపతిరావు 

పల్లవి::

లలలా లలలలలా లలలా లలలలలా లలలలాల
అన్ని బంధాలు తెంచుకొని..ఏ తల్లి కని పారేస్తుంది?
ఏ భరించ లేని బాధ..బంధాలను తెంచేస్తుంది
లేకపోతే నవమాసాలు మోసి..కన్నబిడ్డను ఏ తల్లి దూరం చేసుకొంటుంది

ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు
కన్నతల్లికే తెలుసు ఎన్నేళ్ళో..కన్నీళ్ళకే తెలుసు..ఎన్నేళ్ళో 
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 

చరణం::1

ఏడుకొండలవాడు..కాపాడుతుంటే 
ఏడేడు కలిసి..నూరేళ్ళు..ఊ ఊ ఊ 
ఏడుకొండలవాడు..కాపాడుతుంటే 
ఏడేడు కలిసి..నూరేళ్ళు..ఊ
విడువని తల్లీ..అలుమేలుతల్లీ 
వేయేళ్ళంటే..వేయేళ్ళు..ఊ 
అమ్మ కడుపు చల్లగా..అత్తకడుపు చల్లగా 
అంతకంతగా..పెరిగి వర్ధిల్లు..ఊ
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 

చరణం::2

చిన్నికృష్ణమ్మకు..జిలుగు పట్టు షరాయి
చిలిపి గోపాలునకు..తళుకు నెమలి తురాయి
చిన్నికృష్ణమ్మకు..జిలుగు పట్టు షరాయి
చిలిపి గోపాలునకు..తళుకు నెమలి తురాయి
ఇందరిలో ఈనాడు..అందాల పాపాయి 
యశోదమ్మ కన్నయ్యవు..నీవేనోయీ..ఈ 
కన్న ఆ దేవకీ..కన్నీటి పాపాయి 
ఇదే పట్టు షరాయి..ఇదే నెమలి తురాయి
ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళూ చిన్నారి బాబుకు..ఎన్నేళ్ళు 

చరణం::3

చిరుబుగ్గల..నీ తల్లీ చెక్కిట ఆనించి
ఏదీ ఒక్కసారి..అమ్మా అను
చిరుబుగ్గల..నీ తల్లీ చెక్కిట ఆనించి
ఏదీ ఒక్కసారి..అమ్మా అను
చిట్టిచేతులు చుట్టూ..గట్టిగ పెనవేసీ 
ఏదీ ఒక్కసారి..అమ్మా అను 
ఏదీ ఒక్కసారి..అమ్మా అను..ఊ

No comments: