Wednesday, December 11, 2013

వింతకథ--1973

సంగీతం::పుహళేంది 
రచన::దేవులపల్లికృష్ణశాస్త్రి  
గానం::S.P.బాలు 
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,నల్ల రామూర్తి,సత్తిబాబు,లీలారాణి,ఝాన్సి,విజయలక్ష్మి

పల్లవి::

ఆగు..రవంత ఆగు..ఓ మలుపుల ఒంపులవాగు 
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం
అల మునికుమారివని అనుకోనీ..అనుకోనీ
ఒక వనమయూరివని...అనుకోనీ
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం

చరణం::1

ఎరుగుదు నిను ఎప్పటినించో..ఎదురుచూతు ఏనాటినించో
ఎరుగుదు నిను ఎప్పటినించో..ఎదురుచూతు ఏనాటినించో
అలనాటి ఆశ్రమవాటిలో..నడయాడే కనె లేడివనీ
ఒక మావి బోదెపై ఒరిగి..ఊగాడే వన్నెలాడివనీ
పొదచాటున మెదలే తుమ్మెదలే..అటుపొంచి చూచి నీ కన్నులనీ    
అనుకోనీ..కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం

చరణం::2

కవిదేవుని మానస సరోవరం..కదిలించిన ఓ కలహంసీ
కవిదేవుని మానస సరోవరం..కదిలించిన ఓ కలహంసీ
దివిజమోహినీ అమృతవాహినీ..తెలుసు నాకు నీవెవరో
దివిజమోహినీ అమృతవాహినీ..తెలుసు నాకు నీవెవరో
ఏ తపసి మనసు భావించెనో..ఏ తరుణి సొగసు ప్రసవించెనో
ఏ తపసి మనసు భావించెనో - ఏ తరుణి సొగసు ప్రసవించెనో 
కరుణించిన కణ్వ తపోవనిలో..విరబూచిన వసంతలక్ష్మీవనీ
అనుకోనీ కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం
అల మునికుమారివని అనుకోనీ..అనుకోనీ
ఒక వనమయూరివని...అనుకోనీ
కరిగించకు ఈ స్వప్నం..కదిలించకు నా స్వర్గం

No comments: