Saturday, December 07, 2013

మహానటి సావిత్రికి జన్మదిన శుభాకాంక్షలు

















ఇవాళ సావిత్రిగారు నటించిన సినిమాలోని కొన్ని పాటలు



నర్తన శాల--1963
సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి
రచన::సముద్రాల
గానం::P.సుశీల

పల్లవి::

అమ్మా ఆ ఆ ఆ
అమ్మా ఆ ఆ ఆ
జననీ శివకామిని జయశుభకారిణి విజయరూపిణి
జననీ శివకామిని జయశుభకారిణి విజయరూపిణి
జనని శివకామిని

చరణమ్న్::1

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మా
నీ చరణములే నమ్మితినమ్మా
శరణము కోరితి నమ్మా భవాని

జననీశివకామిని..జయశుభకారిణి 
విజయరూపిణి..జనని శివకామిని

చరణమ్న్::2

నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు
నీదయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి
నిరతము మాకు నీడగ నిలచి
జయము నీయవే అమ్మా
జయము నీయవే అమ్మా భవాని

జననీ శివకామిని..జయశుభకారిణి 
విజయరూపిణి..జనని శివకామిని




దొంగరాముడు--1955
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::సముద్రాల సీనియర్
గానం::జిక్కి

పల్లవి::

అంద చందాల సొగసరివాడు
అంద చందాల సొగసరివాడు
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ..ఓహో చందమామ
చందమామ ఓహో చందమామ ఓఓఓ

చరణం::1

ఓ..ఓ..ఓ..చూడచూడంగ మనసగువాడు
ఈడు జోడైన వలపుల రేడు
ఊఁ..వాడు నీకన్నా సోకైన వాడు
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ..ఓహో చందమామ
చందమామ ఓహో చందమామ ఓఓఓ

చరణం::2

ఓ..ఓ..ఓ..వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
ఊఁ..వాడు నీకన్నా చల్లని వాడు
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ..ఓహో చందమామ
చందమామ ఓహో చందమామ ఓఓఓ

చరణం::3

ఓ..ఓ..ఓ..నేటి పోటీల గడుసరివాడు
మాట పాటించు మగసిరివాడు
ఊఁ..వాడు నీకన్నా సిరిగిలవాడు
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ..ఓహో చందమామ
చందమామ ఓహో చందమామ
అంద చందాల సొగసరివాడు
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ..ఓహో చందమామ
చందమామ ఓహో చందమామ




దొంగరాముడు--1955
సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::సముద్రాల సీనియర్
గానం::జిక్కి,బృందం

పల్లవి::

రారోయి మా ఇంటికి..ఊఁ
రారోయి మా ఇంటికి మావో 
మాటున్నది మంచి మాటున్నది
మాటున్నది మంచి మాటున్నది

చరణం::1

నువు నిలుసుంటె నిమ్మచెట్టు నీడున్నది
నువు కూసుంటె కూర్చీలో పీటున్నది
నువు తొంగుంటె పట్టుమంచం పరుపున్నది
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి మావో 
మాటున్నది మంచి మాటున్నది

చరణం::2

ఆకలైతే సన్నబియ్యం కూడున్నది
నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది
అందులోకి అరకోడి కూరున్నది
అందులోకి అరకోడి కూరున్నది
ఆపైన రొయ్యపొట్టు చారున్నది
మాటున్నది మంచి మాటున్నది
రారోయి మా ఇంటికి మావో 
మాటున్నది మంచి మాటున్నది

చరణం::3

రంజైన మీగడ పెరుగున్నది
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
నీకు రోగమొస్తే ఘాటైన మందున్నది
రోగమొస్తే ఘాటైన మందున్నది
నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది





















అర్థాంగి --1955
సంగీతం::B.నరసింహారావు-అశ్వత్థామ
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::జిక్కి,

పల్లవి::

ఎక్కడమ్మా చంద్రుడు ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చుక్కలారా అక్కలారా నిక్కి నిక్కి చూతురేలా
ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::1

చక్కనైనచంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
మబ్బువెనక దాగినాడో మబ్బువెనక దాగినాడో
మనసు లేక ఆగినాడో
ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::2

పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాడు
ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు

ఎక్కడమ్మా చంద్రుడు


























అప్పుచేసి పప్పుకూడు--1959
సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, P.లీల

పల్లవి::

ఎచటి నుండి వీచెనో..ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో..ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా..ఆ..
ప్రకృతినెల్ల హాయిగా..ఆ..
తీయగా..మాయగా..పరవశింప జేయుచు
ఎచటి నుండి వీచెనో..ఈ చల్లని గాలి

చరణం::1

జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా..ఆ..
మనసు మీద హాయిగా..ఆ..
తీయగా..మాయగా..మత్తుమందు జల్లుతూ
ఎచటి నుండి వీచెనో..ఈ చల్లని గాలి

చరణం::2

హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా..ప్రకృతినెల్ల హాయిగా
తీయగా..మాయగా..పరవశింప జేయుచు
ఎచటి నుండి వీచెనో..ఈ చల్లని గాలి

ఈ చల్లని గాలి












రక్త సంబంధం--1962
సంగీతం::ఘంటసాల
రచన::అనిసెట్టి సుబ్బారావు
గానం::P. సుశీల & బృందం

పల్లవి::

బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే
కళ్యాణ శోభ కనగానే కనులార తనివితీరేనే ఓ..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం::1

ఎనలేని నోము నోచీ నీవీరోజుకెదురుచూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే..ఓ..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం::2

అందాల హంస నడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచి వున్నాడు పెళ్ళికొడుకే
నూరేళ్ళపంట పండేనే గారాల సిరులు చెరిగేనే ఓ..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే

చరణం::3

మనసైన వాడు వరుడు నీ మదినేలు వాడె ఘనుడు
వేసేను మూడుముళ్ళు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురౌతారే
ఊ –ళూ ళూ ళూ – హాయి..హా..హా..హా..
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే



















మనుషులు మమతలు--1965
సంగీతం::T.చలపతి రావు
రచన::దాశరథి
గానం::P.సుశీల

పల్లవి::

నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ

చరణమ్న్::1

ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలావుండిపోనీ నీ దాసినై...

నిన్ను చూడనీ నన్ను పాడనీ
నిన్ను చూడనీ
చరణమ్న్::2

నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలారాలిపోనీ నీ కోసమే..

నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ

No comments: