సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::D.S.Prakas Rao
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ, గుమ్మడి,లక్ష్మి,బాలయ్య,శాంతకుమారి,బేబీ శ్రీదేవి,కైకాల సత్యనారాయణ
పల్లవి::
ఆహా హా అహ అహ అహ అహ
మ్మ్ మ్మ్ హు హు మ్మ్ హు హు
మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది
అహ్హా హ్హా హ్హా..ఏమంటుంది
చల్లగా చిరుజల్లుగా అది కురవాలంటుంది
గల గల దూకే గడసరి వయసే ఏమంటుంది
అ హ్హా హ్హా హ్హా..ఏమంటుంది
తరగలా యేటి నురగలా అది ఉరకాలంటుంది
చరణం::1
ఎవ్వరు లేని ఈవేళ ఇంతటి బిడియం ఎందుకో
ఎగిరిపడే నీ వయసే ఎంతకు ఆగదు ఎందుకో
ఎవ్వరు లేని ఈవేళ ఇంతటి బిడియం ఎందుకో
ఎగిరిపడే నీ వయసే ఎంతకు ఆగదు ఎందుకో
నీ మనసే పంజరమైతే నా వయసే రాచిలకైతే
నీ మనసే పంజరమైతే నా వయసే రాచిలకైతే
నింగినైన కాదంటుంది నీ యెదలో ఒదుగుతుంది
మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది
అ హ్హా హ్హా హ్హా..ఏమంటుంది
చల్లగా చిరుజల్లుగా అది కురవాలంటుంది
చరణం::2
వెచ్చ వెచ్చని ఈ వలపే వేయిరేకులై విరియాలీ
ముచ్చటగొలిపే ఈ బందం పచ్చ పచ్చగ నిలవాలి
వెచ్చ వెచ్చని ఈ వలపే వేయిరేకులై విరియాలీ
ముచ్చటగొలిపే ఈ బందం పచ్చ పచ్చగ నిలవాలీ
పరిమళించే జీవితంలో పసిడికలలే పండాలీ
పరిమళించే జీవితంలో పసిడికలలే పండాలీ
జన్మ జన్మలకు ఇద్దరమూ జంటగానె ఉండాలీ
జన్మ జన్మలకు ఇద్దరమూ జంటగానే ఉండాలీ
గల గల దూకే గడసరి వయసే ఏమంటుంది
ఓ హో హో హో..ఏమంటుంది
తరగలా యేటి నురగలా అది ఉరకాలంటుంది
మిల మిల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది
అ హ్హా హ్హా హ్హా..ఏమంటుంది
ఓ హో హో హో..ఏమంటుంది
అ హ్హా హ్హా హ్హా..ఏమంటుంది
ఏమంటుంది....ఏమంటుంది
No comments:
Post a Comment