సంగీత::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::D.S.Prakash Rao
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ, గుమ్మడి,లక్ష్మి,బాలయ్య,శాంతకుమారి,బేబీ శ్రీదేవి
పల్లవి::
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
పదహారు కళలతో...పెరగాలిరా
నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా
పదహారు కళలతో...పెరగాలిరా
నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా
చిన్నారి నాన్నా..ఆ..వెన్నెల కూనా
పదహారు కళలతో...పెరగాలిరా
నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా
చిన్నారి నాన్నా..ఆ..వెన్నెల కూనా
చరణం::1
తాతయ్య మూపుపై..స్వారీ చేసేవు
తాతయ్య మూపుపై..స్వారీ చేసేవు
నాయనమ్మ మూతిపై..వెన్న రాసేవు
నాయనమ్మ మూతిపై..వెన్న రాసేవు
నీకేమి లోటురా...ఈ యింటిలో
నీకేమి లోటురా...ఈ యింటిలో
నిను దాచుకుంటాను..నా కంటిలో
నిను దాచుకుంటాను..నా కంటిలో
పదహారు కళలతో...పెరగాలిరా
నువ్వు పదిమందిలో పేరు పొందాలిరా
చిన్నారి నాన్నా..ఆ..వెన్నెల కూనా
చరణం::2
నా ప్రాణమేరా ఆ అమ్మ నీ ప్రాణమేరా ఈ అమ్మ
నా ప్రాణమేరా ఆ అమ్మ నీ ప్రాణమేరా ఈ అమ్మ
ఆ అమ్మ దేవతగ మారిందిరా ఈ అమ్మయే నీకు మిగిలిందిరా
ఆ అమ్మ దేవతగ మారిందిరా ఈ అమ్మయే నీకు మిగిలిందిరా
ఈ అమ్మయే నీకు మిగిలిందిరా
No comments:
Post a Comment