సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::S.V.రంగారావు,అంజలీదేవి,బేబి శ్రీదేవి,కాంతారావు,S.వరలక్ష్మి,హరనాధ్
పల్లవి::
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం
ముని శాపముచే...వగచే సతీపతులకూ
తనయుల నొందే మార్గము...తాపసి తెలిపే
మును దుర్వాసుడు చెప్పిన..మంత్రముచేతా..ఆ..ఆ
మును దుర్వాసుడు..చెప్పిన మంత్రముచేతా
తన వంశము నిలపమని...జనపతి కోరే
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం
చరణం::1
కృష్ణాగ్రజుడై బలరాముడు..గోకులమున జనియించే
కుంతికి ధర్ముని అనుగ్రహంబున..కులదీపకు డుదయించే
ఆ శుభవార్తకు గాంధారీ..సతి అసూయ చెందినదీ
ఈసున గర్భ తాడన..మింతి తానొనరించినదీ
వ్రయ్యలైన గర్భమ్మును..వ్యాసుడు సంరక్షించెనూ
పిండమును నూటొక్క..కుండల విభజించెనూ
వరమునిచ్చెను వాయుదేవుడు..అంత వనిత కుంతికి పుట్టె భీముడు
మొదటి కడవ జొచ్చెను...కలిపురుషుడు
కలిగే గాంధారికి తొలి పుత్రుడూ..కలిగే గాంధారికి తొలి పుత్రుడూ
దుర్యోధన జననముచే....దుశ్శకునమ్ములు దోచే
దుర్భర రావమ్ములకు..ధు:ఖించెను జగతీ
దుష్టుల శిక్షించుటకై..శిష్టుల రక్షించుటకై
అష్టమి శుభలగ్నమున..హరి సరుగున వెలసే
నారాయణ నీ లీల...నవరసభరితం
నీ ప్రేరణచే జనియించే బాలభారతం..బాలభారతం
చరణం::2
జనియించిన హరి జననీ జనకుల..జ్ఞానుల గావించే
తనయుని చేకొని వసుదేవుడు..తా వ్రేపల్లెకు జేర్చే
యశోద సుతయౌ యోగమాయ..నా నిశీధమున తెచ్చే
నశింపజేయగ దలచెడి కంసుడు..అశెక్త దిగ్బ్రముడాయే
అమరేంద్రుని అతినిష్టతొ..అర్చించెను కుంతి
అతని వరముచే నరుడే..అర్జునుడై పుట్టె
నరనారాయణ జననము..ధరణికి ముదమాయే
సురలు మురిసి సుధలు చిందు..విరివానలు విరిసే
శతపుత్రుల పిదప నొక్కసుతను..గాంచె గాంధారీ
శకుని కూడ సుతుని బడసి..సంతోషము తానొందె
నాతి మాద్రి అశ్వినులను..ప్రీతితో భజించే
నకులుడు సహదీవుడనే..నందనులను గాంచే
కౌరవులూ పాండవులూ..కమనీయులు యాదవులూ
కారణ జన్ములు సర్వులు..ధారుణి ప్రవర్దమానులైరి
దారుణ హింసా కాండల..దానవ పతి కంసుడూ
ధనుర్యాగమని బలరామకృష్ణుల..తన వద్దకు రప్పించే
No comments:
Post a Comment