సంగీత::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరీ
పల్లవి::
బలె బలె బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా
కని విని ఎరుగని...విడ్డూరం
సరిసాటిలేని మీ...ఘనకార్యం
బలె బ బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా
చరణం::1
మీరు నూరుగురు...కొడుకులు
అహ మారుమ్రోగు..చలి పిడుగులు
మీరు నూరుగురు...కొడుకులు
అహ మారుమ్రోగు..చలి పిడుగులు
మట్టితెచ్చి గంభీర..గుట్టలేసి
జంభారి పట్టపేనుగు బొమ్మచేయు ఘటికులు
అహా..జంభారి పట్టపేనుగు బొమ్మచేయు ఘటికులు
వీరాధి వీరులైన..శూరాతి శూరులైన
మీ కాలిగోటికి...చాలరు
బలె బ బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా
చరణం::2
దైవమేది వేరులేదు...తల్లికంటె
ఆ తల్లికోర్కె తీర్చువారె..బిడ్డలంటె
దైవమేది వేరులేదు...తల్లికంటె
ఆ తల్లికోర్కె తీర్చువారె..బిడ్డలంటె
ఏ తల్లి నోచలేదు...ఇంతకంటె..ఆహా
ఏ తల్లి నోచలేదు...ఇంతకంటె
ఈ మాట కల్ల...కాదు
ఈ రేడు...జగములందు
మీ లాంటివాళ్ళు..ఇంక పుట్టరంటే..ఆహా
బలె బ బలె బలె...పెదబావా
భళిర భళిర...ఓ చినబావా
చరణం::3
మేళాలు తాళాలు..ముత్యాల ముగ్గులు
రత్నాల గొడుగులు...సంబరాలు..హ్హా
మేళాలు తాళాలు..ముత్యాల ముగ్గులు
రత్నాల గొడుగులు...సంబరాలు
ఊరంతా పచ్చని తోరణాలు..వీరణాలు తందనాలు
ఊరంతా పచ్చని తోరణాలు..వీరణాలు తందనాలు
ఊరేగే వైభవాలు...బంగారు వాయనాలు
ఆనంద భరితమౌను....జీవితాలు
బలె బ బలె బలె..పెదబావా
భళిర భళిర..ఓ చినబావా
కని విని ఎరుగని...విడ్డూరం
సరిసాటిలేని...మీ ఘనకార్యం
No comments:
Post a Comment