Thursday, November 13, 2008

శాంతి నిలయం--1972
















సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,B.వసంత
తారాగణం::శోభన్ బాబు,చంద్రకళ,S.V.రంగారావు,అంజలీదేవి,సంధ్యారాణి,ముక్కామల
నాగభూషణం,రాజబాబు,రమణారెడ్డి

ల్లవి::

దేవీ క్షేమమా..దేవరవారూ క్షేమమా
దేవీ క్షేమమా..దేవరవారూ క్షేమమా
తమ కడగంటి చూపే కరువైనాదీ
తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ
దేవీ క్షేమమా..ఆఆఆ             

చరణం::1

నులిసిగ్గుల లేబుగ్గలు..ఎలాగున్నవీ
నులివెచ్చని తొలిముద్దులు..పంపమన్నవీ
నులిసిగ్గుల లేబుగ్గలు..ఎలాగున్నవీ
నులివెచ్చని తొలిముద్దులు..పంపమన్నవీ
అల్లరల్లరీ కళ్ళుచల్లగా వున్నవా..అల్లరల్లరీ కళ్ళుచల్లగా వున్నవా
తెల్లవార్లు నిదురరాక ఎర్రబారుతున్నవీ..దేవీ..ఈ..క్షేమమా..ఆ  

చరణం::2

జడలోనమల్లెపూలు..యిమడకున్నవి
జతలేక పట్టుపరుపు..కుదరకున్నది
జడలోనమల్లెపూలు..యిమడకున్నవి
జతలేక పట్టుపరుపు..కుదరకున్నది
తలగడతో చెప్పుకునే..కబురులే మిగిలినవి
తలగడతో చెప్పుకునే..కబురులే మిగిలినవి
అవికూడ నలిగిపోయి..జాలివేస్తున్నది
దేవీ..ఈఈఈ..క్షేమమా..ఆఆఆ  

చరణం::3

నీ బడిలో చదవాలి..క్రొత్త క్రొత్త చదువులూ
నేనపుడు అడగాలి..చిలిపి చిలిపి ప్రశ్నలూ
పెదవులపై వ్రాయాలి..నీవుమెచ్చు జవాబులూ
పెదవులపై వ్రాయాలి..నీవుమెచ్చు జవాబులూ
నీ మగసిరి గెలవాలి..అసలైన పరీక్షలూ 
దేవీ క్షేమమా దేవరవారూ క్షెమమా..దేవీ..ఈ..క్షేమమా..ఆ 

No comments: