Thursday, November 13, 2008

శాంతినిలయం--1972


సంగీతం::S.P.కోదండపాణి
రచన::ప్రయాగ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,చంద్రకళ,S.V.రంగారావు,రమణారెడ్డి,అంజలీదేవి,సంధ్యారాణి,ముక్కామల
నాగభూషణం,రాజబాబు.

పల్లవి::

చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా 
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా  
కలకాలం వర్ధిల్ల వేడుకలూ..సేదాము     
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

చరణం::1

అనసూయాది శీలవతులలో
మేలిబంతివై మెలగమ్మా..మేలిబంతివై మెలగమ్మా  
అనసూయాది శీలవతులలో..మేలిబంతివై మెలగమ్మా 
నీ యిల్లే వేయిళ్ళై పసుపు కుంకుమతో వర్దిల్లమ్మా  
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

చరణం::2

రతనాల గాజులివే సతినీకే శుభమమ్మ సతినీకే శుభమమ్మ
రతనాల గాజులివే సతినీకే శుభమమ్మ సతినీకే శుభమమ్మ
అనురాగ లతల పెనవేసుకొని అనుకూలవతిగ ధరమనుమమ్మ      
పతి సన్నిధియే సతి పెన్నిధిగా..ఆఆ
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

చరణం::3

నీపాపె కనుపాపై..వెన్నెలలు వెదజల్లూ
ఆఆఆఆఆ 
నీపాపె కనుపాపై..వెన్నెలలు వెదజల్లూ
నీ యిల్లె సిరిమల్లె..పొదరిల్లై విరియాలి  
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా  
కలకాలం వర్ధిల్ల వేడుకలూ సేదాము     
చిన్నారీ సీతమ్మా..సీమంతం రారమ్మా

No comments: