Saturday, November 12, 2011

కాలమారింది--1972


సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,గుమ్మడి,అంజలీదేవి,చంద్రమోహన్,సూర్యకాంతం,గీతాంజలి,అల్లురామలింగయ్య.

పల్లవి::

ఓం..నమో నారాయణాయ
ఓం..నమో నారాయణాయ
ఓం..నమో నారాయణాయ
ఆ..శతసహస్ర ఘంటాహ్వానము నా కొరకేనా 
ఆ..శతసహస్ర వీణాగానము నా కొరకేనా
ఆ..శతశత సహస్ర శంపాప్రభా దివ్యమూర్తి నాకొరకేనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
మందహాస మధుర వదనా శ్రీ సదనా
ఇందు రవి నయన ఫణిశయన..గోవిందా
అరవింద భవ పండిత పదనళిన..గోవిందా 
వందారు మునియోగి బృందా..ముకుందా
బృందార కార్చిత ఇందీవర శ్యామ సుందరా
భక్త ప్రసన్న మందార..భువనాధారా 


ఏదీ..ఏదీ..గంగ కలిగిన పాదకంజాతమేదీ
మెత్తని రమా కరములొత్తిన చరణమేదీ
నలువపుట్టిన నాభి నళినమేదీ ఏదీ 
శ్రీవత్స కౌస్తుభ శ్రీనివాసమ్మేదీ..ఔనుగానీ
కృపాధానీ నీ ఉరమునందేది కలువలరాణీ..ఏది జననీ 
మందహాస మధుర వదనా..శ్రీ సదనా విన్నానుగానీ
కనుగొన్నాను నేడు నను కన్నయ్యవని తెలుసుకున్నాను..నేడు  
నీ సన్నిధినివీడి యింక కదలను..నీ పాదముల క్షణమేని..వదలను 
నీ మూర్తి నా చిత్తమందుండి..పోనీయను..పొనీయను 

No comments: