Sunday, November 13, 2011

జీవన తీరాలు--1977



చిమ్మట లోని ఈ పాట ఇక్కడ వినండి
Suseela would be 'Viswa Vikhyata Sangeeta Kala Saraswati'
13-ii-1935---75th సుశీలమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::G.V.Shekhar
తారాగణం::శివాజీ గణేశన్,కృష్ణంరాజు,వాణిశ్రీ,కొంగర జగ్గయ్య,జయసుధ,గుమ్మడి వెంకటేశ్వరరావు,కాంతారావు,నిర్మల,రావి కొండలరావు.


పల్లవి::

కెరటానికి ఆరాటం..తీరం చేరాలనీ

తీరానికి ఉబలాటం..ఆ కెరటం కావాలనీ
కెరటానికి ఆరాటం..తీరం చేరాలనీ
తీరానికి ఉబలాటం..ఆ కెరటం కావాలనీ
ఎందుకో ఆ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం

కెరటానికి ఆరాటం..తీరం చేరాలనీ..

చరణం::1

కురులపై మెరిసే చినుకులు..ఆణిముత్యాలై
తనువుపై కురిసే చినుకులు..తడితడి ముచ్చటలై
మదిలోపల తెరతీసి..మారాము చేస్తుంటే
మదిలోపల తెరతీసి..మారాము చేస్తుంటే
పదునైన కోరిక ఏదో..పెదవినే గురి చూస్తుంది

ఎందుకో ఈ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం

చరణం::2

ఏమి వెన్నెల ఎంతకూ మన ఇద్దరిపైనే పడుతున్నది
తనకు దాహం వేసిందేమో..మనల్ని అల్లరి పెడుతున్నది
ఎంతెంత దగ్గరగా..ఆ..ఆ..ఇద్దరమూ ఉన్నా..
మరికాస్తా..ఇంకాస్తా..ఒదిగిపొమ్మని..
మౌనంగా ఉరుముతున్నది..వెన్నెల ఉరుముతున్నది

ఎందుకో ఈ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం

చరణం::3

ఇది వసంతమని తెలుసూ..కోయిల పాటలకు
ఇదే మూలమని తెలుసు..తీయని పంటలకు
లలిత లలిత యువ..పవన చలిత పల్లవ దళాలలోనా
నవనవలాడే అనుభవమేదో..నన్నే అలగ మలచుకొన్నది
నన్నే అలగా మలచుకొన్నది

ఎందుకో ఈ ఆరాటం..అందుకే..అందుకే..ఆ ఉబలాటం


కెరటానికి ఆరాటం..అహహహా..
తీరం చేరాలనీ
తీరానికి ఉబలాటం..అహహహా
ఆ కెరటం కావాలనీ

లలలాలలలా..లాలలలలలాలా
లలలాలలలా..లాలలలలలాలా
లలలాలలలా..లాలలలలలాలా
లలలాలలలా..లాలలలలలాలా

No comments: