Saturday, November 12, 2011
ఇంద్రుడు-చంద్రుడు--1989
సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::బాలు,P.సుశీల
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
డో రే మీ రాగల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
చినుకు చినుకు నడుములో చిలకలులికిపడునులే హోయ్
నల్ల కనుల నడుమ లో అలలసుడులు తిరిగేలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తోలికేలే
తనువు తనువు కుదుపులో తమకమొక్కటి మెరిసేలే
సంధ్యలో తారలగా స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా
హంసలా..ఆ..హాయిగా..ఆ..ఆమని రేయిలా వాలిపో ప్రియ
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
డో రే మీ రాగల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
ఎదుట పడిన బిడియమే..చమట నుదుట చిలికేలే
వణుకు తొణుకు పరువమే..ఒడికి వయసు కలిపేలే
వలపు పొడుపు కధలలో..చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో..మరుడి పురుడు జరిగేలే
తేనెలే దోచుకేల్లె..తుమ్మెదై పోకుమా
గాలికే గంధమిచ్చె..కౌగిలింతే దూరమా
పాటల..ఆ..తోటలో..ఆ..పల్లవే ప్రేమగా పాడుకో ప్రియ
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
డో రే మీ రాగల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఉహల పకపక లో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment