Saturday, November 24, 2012

మట్టిలో మాణిక్యం--1971

సంగీతం::సత్యం
ప్రొడ్యుసర్::చలం 
Director:దర్శకత్వం::B.V.ప్రసాద్ 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు

తారాగణం::P.భానుమతి, చలం,జమున,చలం,జమున,పద్మనాభం
గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ

పల్లవి::

రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే
మోటరు కారు...బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్

చరణం::1

అటు చూస్తే చార్మినారు..ఇటు చూస్తే జుమ్మా మసీదు
అటు చూస్తే చార్మినారు..ఇటు చూస్తే జుమ్మా మసీదు
ఆ వంకా అసెంబ్లీ హాలు..ఈ వంకా జూబిలి హాలూ
తళ తళ మెరిసే..ఏఏఏఏఏఏ..తళ తళ మెరిసే 
హుస్సేనుసాగరు..దాటితే...సికింద్రబాదూ
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్

చరణం::2

ఒక తలపై రూమీ టోపీ..ఒక తలపై గాందీ టోపీ
ఒక తలపై రూమీ టోపీ..ఒక తలపై గాందీ టోపీ
క్యాభాయి అని అంటాడొకడూ..ఏమోయీ అని అంటాడొకడూ
మతాలు భాషలూ వేరైనా..ఆఆఆఆఆ..మతాలు భాషలూ వేరైనా
మనమంతా...భాయీ భాయీ
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్

చరణం::3

ఉన్నవాడికి తింటే అరగదు..లేనివాడికి తిండే దొరకదు 
ఉన్నవాడికి తింటే అరగదు..లేనివాడికి తిండే దొరకదు 
పరుపులున్నా పట్టదు నిదర..కరుకు నేలను గురకలు వినరా
హెచ్చు తగ్గులు తొలిగే రోజూ..ఊఊఊఊఊ..హెచ్చు తగ్గులు తొలిగే రోజూ
ఎపుడొస్తుందో...ఏమో 
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
మూడు చక్రములు గిరగిర తిరిగితే..మోటరు కారు బలాదూర్
రింజిం రింజిం హైదరబాద్..రిక్షావాలా జిందాబాద్
లలలలలాల లలలలలాల లలలలలాల లాలా 
లలలలలాల లలలలలాల లలలలలాల లాలా

No comments: