సంగీతం::S.P.కోదండపాణి
రచన::చిల్లర భావనారాయణ
గానం::S..జానకి
శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వె నూదగ వద్దు..బువ్వ నెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు
తొలి సంజె..మలి సంజె నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు
ఇల్ల్లాలు కంటతడి పెట్టనీ యింట
కల్లలాడని యింట గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లో..పసుపు గడపల్లో
పూలల్లో..పాలల్లో..
పూలల్లో..పాలల్లో..ధాన్య రాశుల్లో
మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు
No comments:
Post a Comment