Sunday, October 28, 2012

రెండు రెళ్ళు ఆరు--1986














http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11559
సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.జానకి

పల్లవి::

విరహ వీణ..హా..ఆ..నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో..పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో..ఓఓఓఓ
విరహ వీణ..నిదుర రాక వేగే వేళలో
ఆ..ఆ..ఆ..ఆ..వేగే వేళలో

చరణం::1

జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా
సా..పదసరిగ..గా..దపదసరి..గాదపాగ
గాపరీగ..సరిగరి..సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా..
ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ 
జడలో విరులే..జాలిగ రాలి..జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా
లేలేత వలపు..సన్నాయి పిలుపు..రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళి పందిళ్ళ దాకా..ఆ..ఆ
విరహ వీణ..హా..ఆ..నిదుర రాక వేగే వేళలో..ఆ..వేగే వేళలో

చరణం::2

ఎదలో కదిలే ఏవో కథలు..ఏమని తెలిపేదిరా
చీకటి పగలు వెన్నెల సెగలు..నీ నీడ కోరేనురా
ఈ నాటకాలు మన జాతకానా..రాశాయిలే ప్రేమలేఖా
ఈ దూరమెన్నాళ్ళ దాకా..ఆ..ఆ..ఆ 
విరహ వీణ..హా..నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో..ఓఓఓఓ
విరహ వీణ..నిదుర రాక వేగే వేళలో..ఆఆఅ..వేగే వేళలో

No comments: