Sunday, October 28, 2012

ఉండమ్మా బొట్టు పెడతా--1968



సంగీతం::K.V. మహదేవన్
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రీ  
గానం::P.సుశీల

పల్లవి::

ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి
ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయె..విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి

చరణం::1

ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభుని పాదముల వాలగ
తొందర తొందరలాయే
విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి
సందెగాలి తేలి మురళి

చరణం::2

ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని..విని..విని
ఏదీ ఆ..యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక..ఏదీ విరహ గోపిక

ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి
తొందర తొందరలాయె..విందులు విందులు చేసే
ఎందుకీ సందెగాలి..సందెగాలి తేలి మురళి

No comments: